శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 6 జులై 2015 (20:57 IST)

కారు ఖ‌రీదు రూ.8.5 కోట్లు..రిజిస్ట్రేష‌న్ ఫీజు రూ.1.6 కోట్లు... అది ఎవరి కారు?

రాజు త‌లుచుకుంటే కార్ల‌కేం కొద‌వ‌.. వాటి రేటేకేం కొద‌వ అనుకునే వాళ్ళం.. వాటి రిజిస్ట్రేష‌న్ కూడా కొద‌వ లేద‌ని తేలిపోయింది. ఓ కారు ఖ‌రీదు రూ.8.5 కోట్లు.. దాని రిజిస్ట్రేష‌న్ ఖ‌ర్చు 1.6 కోట్లు.. ఇది భార‌త‌దేశంలోనే అత్య‌ధిక ఫీజు. ఇంత అత్య‌ధిక ఫీజు చెల్లించిన రాజు ఎవ‌రా అని లోచిస్తున్నారు క‌దూ. అంబానీ... ముఖేష్ అంబానీ.. ఆయ‌నే ఇంత‌వ‌ర‌కూ అత్య‌ధిక వాహ‌న న‌మోదు ఫీజును చెల్లించిన వ్య‌క్తి ఏం ? ఎందుక‌లా? అత‌న‌స‌లు ఏ కారు కొన్నాడు. 
 
రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ అధినేత ముకేష్‌ అంబానీ ఆమధ్య జర్మనీనుంచి మంచి బ్రహ్మాండమైన బిఎండబ్ల్యు వాహనం తెప్పించుకున్నారు. ఆ కారు మామూలు బిఎండబ్ల్యు అనుకున్నారేమో, కానేకాదు, అది అత్యాధునికమైన 7 సిరీస్‌ బిఎండబ్ల్యు కారు. దీని ధ‌ర దాదాపుగా రూ..8.5 కోట్లు! అంటే కారు బేసిక్‌ మోడల్‌లో మార్పులు చేర్పులు చేసినందుకు, అలాగే రక్షణ సౌకర్యాలు కల్పించినందుకు, ఇంకా ఆ కారులో అనేక విడిభాగాలను అమర్చినందుకు, వీటన్నిటికీ దిగుమతి సుంకం వేసినందుకూ అంతా కలిపి తడిసిమోపెడైంది. 
 
అదంతా సరే, ఇంతకీ ఈ విశిష్టమైన, అత్యంత ఖరీదైన కారు రిజిస్ర్టేషన్‌కు అయిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా ఒక కోటి అరవై లక్షల రూపాయలు! ఈ మొత్తాన్ని రిలయన్స్‌ కంపెనీ ముంబాయి రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసు (ఆర్‌టిఓ) కార్యాలయంలో చెల్లించింది. ఒక కారు రిజిస్ర్టేషన్‌కు ఇంత పెద్ద మొత్తం ఫీజు కట్టడం భారతదేశంలో ఇదే మొదటిసారి!
 
ఈ కారు మామూలుగా అయితే సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యుండేది. అయితే ఈ 760ఐ సిరీస్‌ కారులో చాసిస్‌ను మార్చారు, అద్దాలు మార్చారు. 2013నుంచి ముకేష్‌ అంబానీ జడ్‌ కేటగిరీలో ఉన్నారు. అందువల్ల ముకేష్‌ భద్రతకోసం ఈ మార్పులు చేర్పులు అవసరమయ్యాయి.