శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (12:11 IST)

జార్ఖండ్ ఎన్నికలు: మోడీకి సీఎం కౌంటర్ అటాక్.. దొంగల పార్టీ అంటూ..

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విమర్శల దాడులు కొనసాగుతున్నాయి. అధికారం నుంచి దొంగలను తరిమికొట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వగా, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ధీటుగా స్పందించారు. బీజేపీ ఓ దొంగల పార్టీ అని విమర్శించారు. 
 
పకూర్, మహశ్ పూర్ నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో మాట్లాడిన సందర్భంగా సొరెన్ బీజేపీని దుయ్యబట్టారు. వారి కన్నా జార్ఖండ్‌లోని ఖనిజ లవణ నిక్షేపాలపై పడిందని ఆరోపించారు. రాష్ట్రం వెలుపలి వ్యక్తులకు వాటిని అప్పగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని మండిపడ్డారు.
 
పనిలో పనిగా సొరేన్ కాంగ్రెస్ పైనా ఆయన బాణాలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ గిరిజనులను మోసం చేసిందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ అవకాశవాద పార్టీలని విమర్శించారు. అందుకే, రాష్ట్రాభివృద్ధి కోసం జేఎంఎంకు మద్దతివ్వాలని సొరెన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.