శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (11:48 IST)

కాంగ్రెస్ ఓటమికి సోనియా - రాహుల్ బాధ్యులు కారా?: నట్వర్ సింగ్

గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ఘోర పరాభవానికి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాదా అని ఆ పార్టీ సీనియర్ నేత నట్వర్ సింగ్ ప్రశ్నించారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇందిరా గాంధీకి 181 సీట్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. మరి ఇపుడు ఘోర పరాజయానికి బాధ్యులెవరని ఆయన సూటిగా ప్రశ్నించారు. 
 
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినవారు బాధ్యులు కాదా అన్నారు. ఎమర్జెన్సీ తర్వాత కూడా ఇందిరా గాంధీకి 181 సీట్లు వచ్చాయని నట్వర్ సింగ్ గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దుస్థితికి సోనియా, రాహుల్ బాధ్యులు కాదా అని ఆయన మరోసారి ప్రశ్నలు సంధించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్కు కీలకమైనవన్నారు. 
 
నట్వర్‌ సింగ్ రాసిన ఆత్మకథ (వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్: యాన్ ఆటోబయోగ్రఫీ) పుస్తకం శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను సోనియా లక్ష్యంగా పుస్తకం రాయలేదని స్పష్టం చేశారు. 2011 ఆఖరులో పుస్తకం రాయడం మొదలుపెట్టానని, అయితే పుస్తకం రాయడం పూర్తయ్యేవరకూ ఏ విషయాన్ని తాను బయట పెట్టలేదన్నారు. 
 
సోనియా గాంధీ ప్రధాని కాకుండా రాహుల్ అడ్డుకున్నారన్నది సరికాదని, నానమ్మ, తండ్రిని పోగొట్టుకొని.. తల్లిని పోగొట్టుకోలేన్నారని, రాహుల్... సోనియా విషయంలో సరైన నిర్ణయమేనన్నారు. ప్రియాంకా వచ్చినా కాంగ్రెస్ భవిష్యత్ను కాలమే నిర్ణయిస్తుందన్నారు. పెద్దలను గౌరవించటం భారతీయ సంప్రదాయమని, అయితే కాంగ్రెస్లో తనకు సరైన గౌరవం దక్కలేదని నట్వర్ సింగ్ ఆక్రోశించారు. నిజాలు బయటపెట్టవద్దని ప్రియాంక గాంధీ కోరారని, కాంగ్రెస్లో జరిగిన అవమానానికి ఆమె క్షమాపణ చెప్పారని ఆయన తెలిపారు. 
 
ఇక శ్రీలంక విషయంలో తప్పు జరిగిందన్నది వాస్తవమన్నారు. శ్రీలంకకు శాంతి సైన్యం పంపిన విషయాన్ని రాజీవ్ గాంధీ కేబినెట్తో సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారన్నారు. తాను నరేంద్ర మోడీని కలిసింది బీజేపీతో ఒప్పందం కోసం కాదని నట్వర్ సింగ్ తెలిపారు. మోడీకి విదేశీ వ్యవహారాలపై సలహా ఇచ్చేందుకే కలిసినట్లు ఆయన తెలిపారు.