శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 5 మే 2016 (19:56 IST)

నీట్ పైన సుప్రీం విచారణ రేపటికి వాయిదా

నీట్ పైన సుప్రీం విచారణ రేపటికి వాయిదా ప‌డింది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు కొన‌సాగాయి. అనంత‌రం న్యాయ‌మూర్తి విచార‌ణ రేప‌టికి వాయిదా వేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం రేపు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఏపీ కోరుతున్న మినహాయింపు సాధ్యమవుతుందా అని కేంద్రాన్నిధర్మాసనం అడిగింది. రేపటి వరకు సమయం కావాలని, రేపు సమాధానం చెబుతామ‌ని కేంద్రం చెప్పింది. 
 
ఒకవేళ రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చినా, ప్రైవేట్ కాలేజీలు ఎట్టిపరిస్థితుల్లో సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేందుకు అనుమతించేది లేదని ధ‌ర్మాసం తేల్చి చెప్పింది. మే 1 హాజరైన విద్యార్థులు జూలై 24న నిర్వహించే పరీక్షకు హాజరు కావచ్చా అని కేంద్రాన్నిధర్మాసనం ప్ర‌శ్నించింది. వీట‌న్నింటిపై విచార‌ణ రేప‌టికి వాయిదా ప‌డింది.