శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (20:51 IST)

ఫేస్ బుక్‌కు ఎదురుదెబ్బ... నెట్ న్యూట్రాలిటి వైపే ట్రాయ్....

భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ నెట్ న్యూట్రాలిటీ వైపే మొగ్గు చూపింది. ట్రాయ్ నిర్ణయంతో ఫేస్‌బుక్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఫ్రీ బేసిక్స్ కోసం ఎదురుచూసిన ఫేస్ బుక్‌కు ట్రాయ్ నిర్ణయంతో గట్టి దెబ్బ తగిలినట్లయింది. ఈ సందర్భంగా ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ మాట్లాడుతూ... ఇంటర్నెట్ డేటాపై కంపెనీలన్నీ వివిధ రకాల ఛార్జీలను వసూలు చేయరాదన్నారు. ఈ నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
ఉల్లంఘించిన టెలికాం ఆపరేటర్లకు రోజుకు రూ.50 వేల వరకూ జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాగా ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్నెట్ ప్యాకేజీలన్నీ వెంటనే రద్దవుతాయనీ, డేటా ప్యాకేజీలన్నీ ఒకే రకంగా ఉండాలని సూచించారు.