శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (15:15 IST)

పెళ్లికి 500 మందికి మించరాదు... నిశ్చితార్థం 100 మంది అతిథులకే పరిమితం

సాధారణంగా పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. భారీ సంఖ్యలో అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగే వేడుక. అలా జరిగే పెళ్లి గురించి ప్రతి ఒక్కరూ ఓ యేడాది చెప్పకోవాలి. కానీ, ఇకపై అటువంటి హంగామా చేసే

సాధారణంగా పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. భారీ సంఖ్యలో అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగే వేడుక. అలా జరిగే పెళ్లి గురించి ప్రతి ఒక్కరూ ఓ యేడాది చెప్పకోవాలి. కానీ, ఇకపై అటువంటి హంగామా చేసే అవకాశం లేకుండా చేయాలని జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో జరిగే పెళ్లిళ్లకు అతిథులను ఆహ్వానించడంపై పరిమితి విధించింది. అమ్మాయి పెళ్లిచేసేవారు గరిష్టంగా 500 మందిని, అబ్బాయి పెళ్లి చేసేవారు 400 మందినే ఆహ్వానించాలని షరతు విధించింది. 
 
ఇక నిశ్చితార్థం వంటి చిన్నపాటి శుభకార్యాలను 100 మంది అతిథుల సమక్షంలో మాత్రమే జరుపుకోవాలని సూచించింది. అంతేకాదండోయ్... లౌడ్‌స్పీకర్లు ఉపయోగించడంపై, బాణసంచా కాల్చడంపై, ఆహ్వాన పత్రికతో స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌ వంటివి అందించడంపై నిషేధం విధించింది. రాష్ట్రంలోని వనరులు భారీ పెళ్లిళ్ల పేరిట దుర్వినియోగం కాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.