శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 జులై 2016 (08:57 IST)

నిర్భయ కేసులో కొత్త ట్విస్ట్: జననాంగంలో ఇనుపరాడ్డుతో హింసించనేలేదట.. రూ.10 లక్షలిస్తారట!

కదులుతున్న బస్సులో గ్యాంగ్ రేప్‌కు గురైన నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాలేజీ విద్యార్థినిపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడిన నిందితులు ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తు

కదులుతున్న బస్సులో గ్యాంగ్ రేప్‌కు గురైన నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాలేజీ విద్యార్థినిపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడిన నిందితులు ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు మలుపు తిరిగింది. నిందితుల తరపు న్యాయవాది వారికి మద్దతుగా కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. తమ క్లయింట్లు నిర్భయ కేసులో నిందితులైన ముఖేశ్‌, పవన్‌ తరఫున ఎంఎల్‌ శర్మ ఘటన జరిగిన రోజు బాధితురాలిని ఇనుపరాడ్డుతో హింసించనేలేదన్నారు. 
 
ఇప్పటికే తుదిఘట్టానికి చేరుకున్న నిర్భయ కేసు విచారణను జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. నిర్భయ హత్యాకాండలో ఆరుగురిని దోషులుగా తేల్చిన సెషన్స్‌ కోర్టు గతంలో ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. ఈ ఆరుగురిలో ఓ నిందితుడు రమణ్‌ సింగ్‌ తీహార్‌ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో మైనర్‌ నిందితుడిని జువెనైల్‌ హోమ్‌కి పంపి తర్వాత విడుదల చేశారు. మిగిలిన వారికి విధించిన మరణశిక్షను తగ్గించాలన్న పిటిషన్‌పై గురు, శుక్రవారాల్లో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. 
 
ఈ సందర్భంగా ఎంఎల్‌ శర్మ వాదనలు వినిపిస్తూ బాధితురాలి జననాంగంలో నిందితులు ఇనుపరాడ్డును ఉంచి పాశవికంగా వ్యవహరించారని పోలీసులు కట్టుకథ చెప్పారన్నారు. జననాంగంలో ఇనుపరాడ్డును పెట్టి గర్భాశయం దెబ్బతినకుండా చిన్నప్రేవులను బయటకు లాగడం సాధ్యమయ్యేపనేనా అంటూ ప్రశ్నించారు. ఆమె గర్భాశయం బాగానే ఉన్నట్లు సింగపూర్‌ ఆస్పత్రి నివేదిక ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుచేత తమ క్లయింట్లకు విధించిన ఉరిశిక్షను తగ్గించాలని కోర్టును విజ్ఞప్తి చేశారు. 
 
ఈ సందర్భంగా విచారణ అనంతరం శర్మ కోర్టు వెలుపల మాట్లాడుతూ.. నిర్భయ గర్భాశయం దెబ్బతినకుండా జననాంగంలోనుంచి చిన్నప్రేవులను బయటకు లాగవచ్చని ఏ వైద్యుడు నిరూపించినా రూ.10 లక్షల బహుమతి ఇస్తానని సవాలు విసిరారు.