Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చీటికి మాటికి ఆత్మహత్యలు.. నేటి యువత ఇంత చేవగారిపోతోందా

హైదరాబాద్, మంగళవారం, 27 జూన్ 2017 (08:40 IST)

Widgets Magazine
suicide

నాన్న లాగా తాగుబోతుగా మారి కుటుంబాన్ని వీధులు పాలు చేయవద్దురా. బాగా చదువుకో అని తల్లి మందలించిందే తడవుగా 15 ఏళ్లు నిండని అబ్బాయి ఉన్నఫళాన ఉరిపోసుకుని చనిపోయి ఆ కుటుంబంలో తల్లిని, అన్నని కూడా పొట్టన బెట్టుకున్నాడు. మార్కులెందుకు తక్కువొచ్చాయిరా అంటే ఆత్మహత్యలు. ఆ హీరోగాడి సినిమా ఫట్ మందని ఆత్మహత్యలు, ప్రేమలో పడి మోసపోయినందుకు ఆత్మహత్యలు. పదిమందిలో పరువు పోయిందని ఆత్మహత్యలు.. 
 
మన దేశానికీ, సమాజానికీ ఏమైందసలు? నేటి యువతీయువకులు మనోస్థైర్యం విషయంలో ఇంత చేవగారిపోయి ఉన్నారా? అయినదానికీ, కానిదానికీ చీటికి మాటికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే దీన్ని సున్నితత్వం అనాలా లేక రుగ్మత అనాలా అర్థం కావడం లేదు. తాజాగా ప్రియుడు మొబైల్ కాల్ రిసీవ్ చేసుకోలేదని ఒక నర్సింగ్ విద్యార్తి కలత చెంది ఆత్మహత్య చేసుకుందట. ఇది కథ.
 
దొడ్డబల్లాపురం, నెలమంగల తాలూకా తిప్పగొండన హళ్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే జీవితాన్ని ఇంత తేలిగ్గా ముగించుకోవచ్చా అని ఆశ్చర్యం, ఆగ్రహం, ఆవేదన ముప్పిరిగొంటున్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రజియా ఖాటూన్‌(19) స్థానిక అంబిక నర్సింగ్‌ కళాశాలలో ఫస్టియర్‌ డిప్లొమా నర్సింగ్‌ చదువుతోంది. ఇదే కళాశాలలో చదువుతున్న సమీం అల్సబ్‌తో కొంతకాలంగా ఆమె ప్రేమ వ్యవహారం నడుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సమీపంలోని ఒక ప్రైవేటు తోటలో ఉన్న గెస్ట్‌హౌస్‌లో ఇద్దరూ ఒక రోజు కలసి ఉండాలని నిర్ణయించుకున్నారు. మొదట వెళ్లిన రజియా అల్సబ్‌కు పలుమార్లు ఫోన్‌ చేసింది. అయితే, అతడు కాల్‌ రిసీవ్‌ చేసుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన రజియా అక్కడే ఉరి వేసుకుంది. కాసేపటి తర్వాత నిర్వాహకులు గదిలో చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. వారి ఫిర్యాదు మేరకు నెలమంగల రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఇలాంటి ఆత్మహత్యలకు సామాజిక పునాది ఏదైనా ఉందా? తాము కోరింది ఇవ్వకపోతే, తాము కోరుకున్నది దొరక్కపోతే, ఒక మాట పరుషంగా అంటే, చావే పరిష్కారమా.. డక్కాముక్కీలు తిని జీవితాలను నెట్టుకొచ్చిన వెనకటి తరాల బాధల్తో పోలిస్తే ఇప్పటి తరం బాధలు అసలు బాధలేనా అనిపిస్తుంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అధికారంలోకి వస్తే జయ మృతి కారకుల పని పడతా.. స్టాలిన్ కొత్త పాట

రాజకీయం ఎన్ని ఆటలైనా ఆడుతుందనడానికి జయలలిత లేని తమిళనాడు రాజకీయాలే పచ్చి నిదర్శనంగా ...

news

హైదరాబాద్ పరువు తీసిన దక్కన్ హోటల్.. ఒంటరి మహిళ వస్తే రూమ్ ఇవ్వనంది

హైదరాబాద్ విశ్వనగరమట. దీన్ని ఇంగ్లీషులో చెబితే కాస్మొపొలిటన్ సిటీ అనవచ్చు. అంటే ఇది లోకల్ ...

news

ఆ రెండు క్షణాలు ఎంత ఆహ్లాదంగా గడిచాయంటే.. మోదీ జోక్‌తో ట్రంప్ దంపతుల ఫిదా

భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ - మెలనియా దంపతులు కలుసుకున్న తొలి క్షణాలు ఆహ్లాదంగా ...

news

సలావుద్దీన్ ప్రపంచ ఉగ్రవాది: అమెరికా ప్రకటనతో భారత్‌కు అతిపెద్ద దౌత్య విజయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ భేటీ కాకముందే భారత దౌత్య ...

Widgets Magazine