Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పార్టీని కాపాడలేకపోతే అమ్మ ఆత్మ నన్ను క్షమించదు : శశికళపై పన్నీర్ ఫైర్

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (15:02 IST)

Widgets Magazine
opanneerselvam

ప్రస్తుత పరిస్థితుల్లో అన్నాడీఎంకేను కాపాడలేకపోతే అమ్మ ఆత్మ తనను క్షమించదని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం ప్రకటించారు. పైగా, ఒక కుటుంబం అన్నాడీఎంకే పార్టీని నియంత్రిస్తోందని ఆయన ఆరోపించారు. 
 
ప్రస్తుత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. ప్రారంభంలో ఆయన వెంట ఒక్క ఎమ్మెల్యే లేదా పార్టీకి చెందిన ఒక్క నేత కూడా లేరు. కానీ, మూడు రోజుల తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది. పలువురు ఎమ్మెల్యేలతోపాటు అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్ ఈ.మధుసూధనన్‌ ముఖ్యమంత్రికి అండగా నిలిచారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన మధుసూద‌న్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. తాను ఇప్పుడు పోరాడ‌క‌పోతే అమ్మ జ‌య‌ల‌లిత ఆత్మ త‌న‌ను ఎన్న‌టికీ క్ష‌మించ‌దన్నారు. మ‌ధుసూద‌న్‌ను కూడా శ‌శిక‌ళ బెదిరించిందని ఆయ‌న ఆరోపించారు. మ‌ధుసూద‌న్ త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డాన్ని స‌మ‌ర్థిస్తున్నాన‌ని వ్యాఖ్యానించారు. త‌మ‌ పార్టీని ర‌క్షించుకోవాల్సిన బాధ్య‌త త‌న‌కు ఉంద‌ని చెప్పారు. మధుసూదన్ చేరికతో తన బలం మరింత పెరిగిందని చెప్పారు. 
 
అమ్మ ఆసుప‌త్రిలో చేరిన 24 రోజుల త‌ర్వాత శశిక‌ళ త‌న‌తో మాట్లాడార‌ని, ఆ స‌మ‌యంలో అమ్మ కోలుకుంటున్నార‌ని చెప్పార‌ని ఆయ‌న అన్నారు. జ‌య‌ల‌లిత మృతిపై విచార‌ణ జ‌రిపించాల్సిందేన‌ని మ‌రోసారి అన్నారు. శ‌శిక‌ళ అరాచ‌కాల‌ను అడ్డుకుంటాన‌ని వ్యాఖ్యానించారు. సీఎం పదవి కోసం చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కుర్చీకోసం ఎవరు డ్రామాలు ఆడుతున్నరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చిన్నమ్మకు సీఎం పోస్ట్ కావాలి.. మరి ఈ లేఖ ఎందుకు రాసినట్టు?: పన్నీర్ ప్రశ్న

పోయెస్ గార్డెన్ నుంచి శశికళను దివంగత ముఖ్యమంత్రి జయలలిత.. అమ్మ 2012లోనే గెంటివేశారనే ...

news

జయలలిత మృతిపై విచారణ చేసుకోమను... నాకేంటి భయం : శశికళ

తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం అనేక కొత్త విషయాలను బయటపెడుతోంది. జయలలిత మృతికి ...

news

తిరుమల శ్రీవారి ఖర్చులకు డబ్బుల్లేవు... రూ.కోట్లు ఏమైపోతున్నాయి?

ఒకప్పుడు తన వివాహం కోసం కుబేరుడి వద్ద అప్పు చేసిన శ్రీనివాసుడు. ఇప్పుడు ఆ కుబేరునికే ...

news

చిన్నమ్మదంతా నాటకమే.. మీటింగ్‌కు వచ్చింది సగంమందే.. పట్టుబిగిస్తున్న పన్నీరు సెల్వం....

తమిళ రాజకీయాల్లో ఇప్పుడు హీరోగా మారిపోయారు పన్నీరుసెల్వం. ప్రతిపక్ష పార్టీలే కాదు సొంత ...

Widgets Magazine