Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గిఫ్ట్ బాక్సులో బాంబు పెట్టి పెళ్లి కుమారుడిని చంపేశారు.. ఎక్కడ?

శనివారం, 24 ఫిబ్రవరి 2018 (13:28 IST)

Widgets Magazine
odisha couple

సాధారణంగా టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ అనేక క్రైమ్ చిత్రాలు నిర్మించాడు. ఈ చిత్రాల్లో గిఫ్టు బాక్సుల్లో బాంబులు పెట్టి ప్రత్యర్థులను హతమార్చే సీన్లు కనిపిస్తుంటాయి. అచ్చం ఇలాంటి దృశ్యమే ఇపుడు ఒకటి రియల్‌గా జరిగింది. ఒడిషా రాష్ట్రంలోని బోలన్ గిరి జిల్లాలో పట్నఘర్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ ప్రాంతానికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తితో రీనా అనే యువతి పెళ్లి ఈనెల 18వ తేదీ జరిగింది. 21వ తేదీ సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి బంధుమిత్రులంతా వచ్చారు. అలా వచ్చిన వారిలో పలువురు గిఫ్టు బాక్సులూ కూడా ఇచ్చారు. ఆ రాతంత్రా హ్యాపీగా సాగింది. 23వ తేదీ ఉదయం ఇంట్లో వచ్చిన గిఫ్ట్ ప్యాక్‌లను వరుడు కుటుంబ సభ్యుల ఓపెన్ చేయడం ప్రారంభించారు. 
 
పెళ్లి కుమారుడు సోమశేఖర్ ఓ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే అది పేలింది. అందులో బాంబ్ పెట్టారు. ఓపెన్ చేయగానే పేలిపోయే విధంగా అమర్చినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసం అయ్యింది. గిఫ్ట్ బాంబ్ పేలుడుతో పెళ్లి కుమారుడు సోమశేఖర్, అతని నానమ్మ జమామొన్నీసా చనిపోయింది. 
 
పెళ్లి కూతురు రీనా తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. గిఫ్ట్ బాంబ్ ఇచ్చింది ఎవరు.. ఎందుకు ఇలా చేశారు అనేదానిపై విచారణ చేస్తున్నారు. రిసెప్షన్ వీడియో పరిశీలిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వరుడిపై ప్రియుడితో యాసిడ్ దాడి చేయించిన వధువు

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో దారుణం జరిగింది. వరుడిపై తన ప్రియుడితో యాసిడ్ దాడి ...

news

రాహుల్ గాంధీ నాయకుడే కాదంట...

సుధీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ అస్సలు ...

news

ప్రధాని మోడీ ఏమైనా పెద్ద పోటుగాడా?: ఎంపీ రాయపాటి ప్రశ్న

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు ...

news

ముగియనున్న చిరంజీవి పదవీకాలం.. రాజకీయాలకు స్వస్తి?

మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ పదవీకాలం వచ్చే నెల రెండో తేదీతో ముగియనుంది. దీంతో ఆయన ...

Widgets Magazine