శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (18:10 IST)

ఫేస్ బుక్ పిచ్చి: ఫేక్ ఐడీలతో భార్యాభర్తలు.. ఎలా విడిపోయారంటే..?

ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫేస్ బుక్ ఓపెన్ చేయకుండా నిద్రపోని వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అలాంటి ఫేస్ బుక్‌తో కొంత మేలు జరుగుతున్నా.. కొన్ని కారణాలతో ఇబ్బందులు తప్పట్లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ఘటన వెలుగు చూసింది. ఫేస్‌బుక్ కారణంగా ఓ జంట విడిపోయారు. అసలు స్టోరీలోకి వెళ్తే.. యూపీలోని రాయ్ బరేలికి చెందిన ఓ కపుల్ సంసారం హాయిగా సాగిపోతోంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి మహా ఇష్టం. ఐతే, ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు.
 
షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. ఈ కపుల్ ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వేర్వేరు పేర్లతో కొనసాగారు. అనుకోకుండా ఈ ఫేక్ ఐడీలతో వున్న ఈ జంట మధ్యే సంబంధాలు ఏర్పడ్డాయి. ఇద్దరు మ్యారేజ్ కాలేదని అబద్ధాలు చెప్పుకున్నారు. మరింత దగ్గరై.. ఆర్నెళ్లు తర్వాత పెళ్లి చేసుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చేశారు. మంచిరోజు చూసుకుని ఇద్దరూ మీట్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. తీరా కలిసేసరికి అసలు విషయం బయటపడింది.
 
ఖంగుతిన్న ఆ భార్యాభర్తలిద్దరు.. ఇంత జరిగాక కలిసి జీవించలేమని ఓ నిర్ణయానికి వచ్చేశారు. విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. నెట్ యూజర్స్ చూశారుగా.. ఇలాంటి ఫేక్ ఐడీలు కాపురాలను ఎలా కూల్చుతాయో.. తస్మాత్ జాగ్రత్త!