సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 జులై 2018 (15:07 IST)

కదిలే రైలులో ఎక్కేశాడు.. కానీ పట్టుతప్పింది.. రైలు ఈడ్చుకెళ్లింది...

కదిలే రైలులో ఎక్కడం, దిగడం కూడదని.. ప్రకటనలు చేస్తున్నా.. త్వరగా వెళ్లాలనే ఆత్రుత చాలామంది కదిలే రైలు ఎక్కుతుంటారు. ఆపై ప్రమాదాలకు గురవుతుంటారు. తాజాగా త్వరగా వెళ్లాలనే ఆతృత ఓ ప్రయాణీకుడి ప్రాణాల మీదక

కదిలే రైలులో ఎక్కడం, దిగడం కూడదని.. ప్రకటనలు చేస్తున్నా.. త్వరగా వెళ్లాలనే ఆత్రుత చాలామంది కదిలే రైలు ఎక్కుతుంటారు. ఆపై ప్రమాదాలకు గురవుతుంటారు. తాజాగా త్వరగా వెళ్లాలనే ఆతృత ఓ ప్రయాణీకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కానీ ఆర్పీఎఫ్ పోలీస్ ధైర్యంగా ముందుకొచ్చి ఆ ప్రయాణీకుడి ప్రాణాలు కాపాడాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని పన్వెల్ రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు. పట్టుతప్పటంతో కదులుతున్న రైలు ఈడ్చుకుంటూ కొంతదూరం తీసుకెళ్లింది.
 
రైల్వేస్టేషన్‌లో ఓ ప్రయాణికుడు కాపాడేందుకు ప్రయత్నించి ధైర్యం చేయలేకపోయాడు. ప్రమాదాన్ని గమనించిన రైల్వే పోలీస్ రైలుకు వేలాడుతున్న వెళ్తున్న వ్యక్తిని కాపాడి, ఫ్లాట్‌ఫామ్‌లోకి లాగేశాడు. 
 
ఈ తతంగం అంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఇక ప్రయాణీకుడిని కాపాడిన రైల్వేసిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
మరోవైపు.. 30 ఏళ్ల మహిళ ఆదివారం ఉదయం ముంబై కల్యాణ్ రైల్వేస్టేషన్‌లో ప్రసవించింది. రైలులో ప్రయాణీస్తున్న గర్భిణీ మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ రైల్వే మెడికల్ స్టాఫ్ సాయంతో చికిత్స చేయించారు. ఈ సందర్భంగా  ప్రయాణీకురాలు కవల పిల్లలకు తల్లి అయ్యింది. రైలులోనే ప్రసవం కావడంతో మెరుగైన చికిత్స కోసం రుక్మిణీభాయ్ ఆస్పత్రికి తరలించారు.