శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (11:12 IST)

అన్నాడీఎంకేలో లుకలుకలు.. పార్టీలో ఓట్లు చీలుతాయా? స్థానిక ఎన్నికల్లో గెలుపు ఎవరిది?

అన్నాడీఎంకే వారసత్వం కోసం నువ్వానేనా అని పోటీపడుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకే చెందిన ఓట్లు చీలిపోనున్నాయి. ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత సంక్షోభం

అన్నాడీఎంకే వారసత్వం కోసం నువ్వానేనా అని పోటీపడుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకే చెందిన ఓట్లు చీలిపోనున్నాయి. ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత సంక్షోభం తలెత్తింది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేయగా ఆయనపై శశికళ వర్గం బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించింది. 
 
శశికళ నాలుగేళ్ల వరకు జైలు నుంచి విడుదలయ్యే అవకాశమే లేదు. ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళవర్గం నేత ఎడప్పాడి కె పళనిస్వామి ప్రమాణస్వీకారం చేశారు. అదేసమయంలో పన్నీర్‌ సెల్వం వర్గం అన్నాడీఎంకే-2గా పనిచేస్తోంది. అంటే జయలలిత జీవించి వుండగా, ఐక్యంగా ఉన్న అన్నాడీఎంకే ఆమె మరణం తర్వాత పార్టీ రెండుగా చీలిపోయింది. మరోవైపు... జయలలిత అన్న కుమార్తె జయ దీప రాజకీయ అరంగేట్రం చేశారు. 
 
ఈమె ఎంజీఆర్‌ జయ దీప పేరుతో ఓ రాజకీయ ఫోరంను ప్రారంభించారు. దీంతో స్థానిక ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరపున మూడు గ్రూపులు ఏర్పడటంతో ఓట్లు చీలుతాయని రాజకీయ పండితులు అంటున్నారు.