శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (12:41 IST)

పాకిస్థాన్ చెరలో భారత సైనికుడు.. కేంద్రానికి మరో సవాల్.. పాకిస్థాన్ ఏం చేస్తుందో?

భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. పాక్ సైన్యం చెరలో భారత సైనికులు చిక్కుకోవడం ప్రస్తుతం సంచలనమైంది. పొరపాటున సరిహద్దు దాటిన భారత సైనికుడిని విడిచిపెట్టాలని హోంమంత్రి రాజ్‌నాథ

భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. పాక్ సైన్యం చెరలో భారత సైనికులు చిక్కుకోవడం ప్రస్తుతం సంచలనమైంది. పొరపాటున సరిహద్దు దాటిన భారత సైనికుడిని విడిచిపెట్టాలని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఇప్పటికే పాకిస్థాన్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే పాకిస్థాన్ ఇంతవరకూ ఏమాత్రం స్పందించలేదు. తోటి సైనికుడు పాకిస్థాన్ చిక్కడంతో సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమ నేస్తానికి ఏం జరగకూడదని కోరుకుంటున్నారు. ఆ సైనికుడి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. తమ బిడ్డను ఎలాగైనా కాపాడాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కేంద్రం పాక్ చెరలో ఉన్న భారత సైనికుడిని విడిపించేందుకు కసరత్తులు చేస్తోంది. 
 
ఇదిలా ఉంటే.. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంస్వం చేసేందుకు భారత సర్జికల్‌ స్ట్రయిక్స్‌కు దిగుతుందనే విషయం అమెరికాకు ముందే తెలుసని వార్తలు వస్తున్నాయి. ఎంత పక్కా ప్రణాళిక ప్రకారం ఆపరేషన్‌ను నిర్వహించినప్పటికీ అమెరికా కళ్లుగప్పడం అంత సులువుకాదని చెబుతున్నారు. అంతేకాక.. బుధవారం ఉదయం జాతీయ భద్రత సలహాదారు అజిత దోవల్‌, అమెరికా భద్రత సలహాదారు సుసాన్‌ రైస్‌కు ఫోన్‌ చేసిన అంశాన్ని కూడా వారు ఉదాహరిస్తున్నారు. దాడులకు సంబంధించిన ప్రణాళిక గురించి ఆయన రైస్‌కు చెప్పి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
 
భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐఎస్‌ఎఫ్‌, ఆక్టోపస్ భద్రతా సిబ్బంది అప్రమత్తమై ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.