శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (16:10 IST)

పాకిస్థాన్‌లో మానహ హక్కుల మహిళా నేత కాల్చివేత!

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొని బయటకు వస్తున్న పాకిస్థాన్ మానవ హక్కుల మహిళా నేతను దారుణంగా కాల్చి చంపేశారు. ఆమె పేరు సబీన్ మహమ్మద్. వయస్సు 40 యేళ్లు. ఈ కాల్పుల్లో ఆమె తల్లికి బుల్లెట్ గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. 
 
ఈ ఘటన శుక్రవారం రాత్రి కరాచిలో చోటు చేసుకుంది. కరాచీలోని ఒక హోటల్‌లో సైలెన్సింగ్ బెలూచిస్థాన్ పేరుతో ఒక సెమినార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సబీన్ మహమ్మద్ పాల్గోని ప్రసంగించారు. తర్వాత తల్లితో కలిసి కారులో వేరే కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరారు. 
 
హోటల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఇద్దరు తీవ్రవాదులు కారు మీద తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. తీవ్రగాయాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సబీన్ మహమ్మద్ మరణించారని పోలీసు అధికారి తారిఖ్ దరేజో తెలిపారు. 
 
బెలూచిస్తాన్‌లో అమాయకులను పోలీసులు నిర్దాక్షణంగా కాల్చి చంపుతున్నారని ఆరోపిస్తూ ఈమె చాల సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ వస్తున్నారు. అందువల్లే ఆమెను తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపారని పోలీసులు చెపుతున్నారు.