Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పళని స్వామి సీఎం పీఠం రేటు రూ.600 కోట్లా...? వారి పంట పండింది...

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (12:27 IST)

Widgets Magazine

అందుకే రాజకీయాల్లో సంక్షోభాలు రావాలని రాజకీయ పార్టీల నేతలు కోరుకుంటూ వుంటారు. పాలన సజావుగా సాగిపోతే మంత్రులుగా వున్నవారికి తప్పించి మిగిలిన ఎమ్మెల్యేలకు పెద్దగా ఒరిగేదేమీ వుండదనే ప్రచారం వుంది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు దాదాపు రూ. 600 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రమాణ స్వీకారం తర్వాత కూడా ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకుండా బస్సులు ఎక్కించి గోల్డెన్ బే రిసార్టుకు తరలించేశారు. 
 
ఇక్కడ తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలందరికీ ఒక్కొక్కరికీ రూ. 5 కోట్ల చొప్పున ఇచ్చేందుకు ఓ డీల్ కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకారం ఇప్పటికే ఒక్కో ఎమ్మెల్యేకు అడ్వాన్సుగా సగం డబ్బు ముట్టిందని సమాచారం. మిగిలిన డబ్బు బలపరీక్ష... ముగియగానే పువ్వుల్లో పెట్టి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద తమిళనాడు రాజకీయాల వేడి ఇంకా తగ్గలేదు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తనదైన రూటులో వెళ్తున్నారు. ఆయన నమ్మకమేమిటో తెలియదు కానీ ఇంకా ప్రభుత్వాన్ని పడదోయగలననే అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో రేపటి వరకూ వేచి చూడాల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పన్నీర్‌కు మద్దతుగా జల్లికట్టు తరహా ఉద్యమం.. పళనికి కష్టాలే..అప్పుడే హెచ్చరించారుగా?

తమిళనాట దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఏ రోజున ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారో ఆ రోజు నుంచి ఆమె ...

news

సమాధినే అంత గట్టిగా కొట్టావే.. జయమ్మను మరెంత గట్టిగా కొట్టావో..?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ జైలులో చిప్పకూడు తింటున్న సంగతి తెలిసిందే. ఈ ...

news

హైదరాబాద్‌లోకుళ్ళిన మాంసంతో బిర్యానీ వండుతున్నారు: 15 రోజులు నిల్వచేసి? బీకేర్ ఫుల్..!

బిర్యానీ సెంటర్లు, హోటళ్లలలో లొట్టలేసుకుని తినే బిర్యానీ ప్రియులకు చేదువార్త. హైదరాబాద్ ...

news

జయమ్మ కేసు.. జైలులో వదిలిపెట్టి చెన్నైకి వచ్చిన నటరాజన్.. అన్నాడీఎంకే ఐటీ శాఖ సీరియస్

జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కోర్టులో లొంగిపోయిన సంగతి ...

Widgets Magazine