Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్కామ్‌లకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోం : కాంగ్రెస్‌కు మోడీ వార్నింగ్

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (14:17 IST)

Widgets Magazine
Narendra Modi

వివిధ రకాల కుంభకోణాలకు పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరిక చేశారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదలు తెలిపే తీర్మానంపై నరేంద్ర మోడీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. తన ప్రసంగమంతా కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ పాలనలో జరిగిన అక్రమాలను లక్ష్యంగా చేసుకుని సాగింది.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బ్యాంకులకు రూ.వేల కోట్ల ఎగవేతలు కాంగ్రెస్‌ పాపమేనన్నారు. అలాంటి దుష్ట విధానాలను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఒక్క పన్ను ఎగవేత జరిగిందా? అని ప్రశ్నించారు.
 
అంతేగాక అవినీతిపరులను జైలుకు పంపే విషయంలో రాజీలేదన్నారు. పన్ను ఎగవేతదారులకు మేం రుణాలు ఇవ్వలేదన్నారు. అలాగే.. మేం దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తున్నామని, విద్యుత్‌ ఉత్పత్తి, పొదుపుపై దృష్టిపెట్టామని, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలైన విద్యా, సొంతింటి కల నెరవేరుస్తున్నామని మోడీ గుర్తు చేశారు.
 
ఇకపోతే, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ‌... దళిత ముఖ్యమంత్రిని అవమానించారన్నారు. అలాగే, నీలం సంజీవరెడ్డి పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. దేశ తొలి ప్రధానిగా నెహ్రూ కాకుండా సర్దార్ వల్లాభాయ్ పటేల్ అయివుంటే కాశ్మీర్ సమస్య ఉండేది కాదన్నారు. అంతేకాకుండా, సరికొత్త విమానయాన పథకాలతో దేశానికి రెక్కలు తొడిగామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అద్భుతమైన విమానయాన విధానం తెచ్చామని నరేంద్ర మోడీ కితాబిచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
భారత జాతీయ కాంగ్రెస్ పార్లమెంట్ రాహుల్ గాంధీ Blame Congress Partition Parliament Live Pm Modi Kashmir Mess; Rajiv Gandhi నరేంద్ర మోడీ

Loading comments ...

తెలుగు వార్తలు

news

పార్లమెంట్ తలుపులు మూసి విభజించారు.. ఆంధ్రాకు అండగా ఉంటాం : ప్రధాని మోడీ

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మూడు రాష్ట్రాలను ...

news

అరాచకాల కాంగ్రెస్సా.. ఏపీ గురించి మాట్లాడేది?: ప్రధాని మోదీ

కేంద్రం విడుదల చేసిన బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ పార్లమెంట్ ఎదుట, లోక్ సభ, ...

news

కారు ప్రమాదంలో చిక్కిన ప్రధాని సతీమణి: ఒకరు మృతి.. ఎవరు?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ ప్రమాదానికి గురైయ్యారు. రాజస్థాన్‌లోని ...

news

టీడీపీ ఎంపీలు చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు.. స్పీకర్ వార్నింగ్

తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారంటూ లోక్‌సభ ...

Widgets Magazine