శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (17:46 IST)

ప్యాసింజర్ రైలును 5 కిమీ వరకు తోసిన ప్రయాణికులు.. ఎక్కడ... ఎపుడు!

సాధారణంగా నడి రోడ్డుపై బస్సులు, లారీలు, కార్లు, చిన్నపాటి రవాణా వాహనాలు ఆగిపోవడం చూస్తుంటాం. అలాగే, ద్విచక్రవాహనాలు కూడా రోడ్లపై మొరాయిస్తుంటాయి. కానీ, బుల్లెట్ రైళ్ళ గురించి మాట్లాడుకుంటున్న ప్రస్తుత రోజుల్లో... ఓ రైలు పట్టాలపై ఆగిపోయినట్టుగా కానీ, అలాంటి సందర్భం కానీ వినడం లేదా చూడటం జరిగివుండదు.
 
 
కానీ, మన దేశ చరిత్రలోనే ఈ తరహా సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. అదీ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకృష్ణుని జన్మస్థానమైన మధురలో. మధుర - బృందావన్‌ల మధ్య నడిచే రాధారాణి ప్యాసింజర్ రైలుకు ఈ పరిస్థితి ఎదురైంది. 
 
ఈ రైలింజన్‌లో ఏర్పడిన సాంకేతికలోపం కారణంగా మధుర ప్రాంతంలో రైలు ఆగిపోయింది. డ్రైవర్ పలుమార్లు ప్రయత్నించినా ఇంజిన్ స్టార్ట్ కాలేదు. దీంతో ప్రయాణికులు దిగి రైలును నెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. స్టార్ట్ కాకపోవడంతో రైలును ఏకంగా ఐదు కిలోమీటర్ల మేరకు ప్రయాణికులు నెట్టుకుంటూ వెళ్లారు. ఇది చూసిన అందరూ అవాక్కయ్యారు. ఈ తరహా సంఘటన జరగడం దేశంలో ఇదేతొలిసారి.