శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (06:41 IST)

తగ్గిన పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు

పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరల్ని ఒకేమారు తగ్గించారు. జులై నెలలో ఇలా ధరలు తగ్గడం ఇది మూడో మారు. అంతర్జాతీయంగా ముడిచమురు తగ్గడం వలన వీటి ధరలను తగ్గించారు.  పెట్రోలుపై లీటరుకు రూ.2.43 తగ్గగా, డీజిల్‌పై లీటర్‌కు రూ.3.60 తగ్గాయి. ప్రస్తుత నెలలో ఇది మూడోసారి తగ్గింపు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వచ్చాయి.

ఢిల్లీలో పెట్రోలు ధర ప్రస్తుతం లీటర్‌కు రూ.66.90 ఉండగా, శనివారం నుంచి రూ.64.47 చొప్పున లభ్యమవుతుందనీ, డీజిల్‌ ప్రస్తుతమున్న రూ.49.72 నుంచి రూ.46.12కు లభిస్తుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, రూపాయి, డాలరు మార్పిడి రేటు క్షీణించడంతో ధరలు తగ్గుముఖం పట్టాయనీ, ఆ ప్రభావాన్ని వినియోగదారులకు అందజేస్తున్నట్లు ఐవోసీ వెల్లడించింది.
 
సబ్సిడీయేతర ఎల్పీజీ ధరల్ని సిలిండర్‌కు రూ.23.50 చొప్పున తగ్గించారు. అంతర్జాతీయ చమురు ధరల్లో తగ్గుదలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో శనివారం నుంచి 14.2 కిలోల సబ్సిడీయేతర సిలిండర్‌ ధర ప్రస్తుతమున్న రూ.608.50 నుంచి రూ.585కే లభ్యమవుతుందని ఐవోసీ తెలిపింది. ఇటీవలి కాలంలో ఇది రెండోసారి తగ్గింపు.