శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 23 మార్చి 2017 (10:36 IST)

ప్రధాని మోడీ సిఫారసు.. ముస్లిం బాలికకు రూ.1.50 లక్షల విద్యా రుణం.. ఎలా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిఫారసుతో ఓ విద్యార్థిని చదువు కోసం రూ.1.50 లక్షల రుణాన్ని పొందారు. దీంతో ఆ విద్యార్థిని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పైగా, దేశ అధినేత నుంచి ఈ తరహా సిఫారసు రావడంతో ఆ యువతి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిఫారసుతో ఓ విద్యార్థిని చదువు కోసం రూ.1.50 లక్షల రుణాన్ని పొందారు. దీంతో ఆ విద్యార్థిని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పైగా, దేశ అధినేత నుంచి ఈ తరహా సిఫారసు రావడంతో ఆ యువతి ఉబ్బితబ్బిబ్బులైపోతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కర్నాటకలోని మాండ్యకు చెందిన ముస్లిం బాలిక బిబి సారా అనే విద్యార్థిని పై చదువులు చదువుకునేందుకు బ్యాంకుల్లో విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే, తగిన దస్తావేజులు చూపలేదన్న సాగుతో బ్యాంకు అధికారులు ఆ యువతికి రుణం మంజూరు చేయలేదు. తీసుకున్న రుణం తీర్చగలదన్న నమ్మకం కుదరకపోవడంతోనే రుణం మంజూరు చేయలేదు. 
 
దీనికి కారణం ఆమె తండ్రి స్థానికంగా ఉండే చిన్నపాటి చక్కెర ఫ్యాక్టరీలో పని చేస్తూ.. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించడమే. దీంతో విసిగి వేసారిన సారా చదువుకునేందుకు సాయం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. ఈ లేఖను పీఎంవో కార్యాలయ అధికారులు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 
 
వెంటనే స్పందించిన ప్రధాని మోడీ... కర్నాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ రాశారు. పది రోజుల్లోగా సదరు విద్యార్ధినికి రూ.1.5 లక్షల రుణం ఇవ్వాలంటూ కోరారు. దీంతో రంగంలోకి దిగిన సీఎస్.. కేవలం ఒక్కరోజులోనే ఆమెకు మాండ్యలోని విజయ బ్యాంకు నుంచి ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకున్నారు. 
 
దీంతో సారా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... 'ప్రధానమంత్రి గారి దగ్గర్నుంచి తప్పకుండా సమాధానం వస్తుందని నేను ఆశించాను. అయితే ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. కేవలం పదిరోజుల్లోనే నాకు రిప్లై వచ్చింది' అని వెల్లడించింది.