శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 24 మార్చి 2018 (15:05 IST)

ఏంటీ... మీకు ఫేస్ బుక్ అకౌంట్ లేదా? భాజపా ఎంపీలకు నరేంద్ర మోదీ క్లాస్

2019 ఎన్నికల నాటికి మళ్లీ విజయ ఢంకా మోగించాలంటే పక్కా ప్రణాళిక ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లాల్సి వుందని భాజపా ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలు చేసారు. ఈ రోజు జరిగిన భాజపా పార్లమెంటరీ సమా

2019 ఎన్నికల్లో మళ్లీ విజయ ఢంకా మోగించాలంటే పక్కా ప్రణాళిక ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లాల్సి వుందని భాజపా ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలు చేసారు. ఈ రోజు జరిగిన భాజపా పార్లమెంటరీ సమావేశంలో పలు విషయాలపై లోతుగా చర్చ జరిపారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు తమపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను భాజపా ఎంపీలు ఎదుర్కోవడం లేదనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. 
 
దీనికి కారణం... భాజపా ఎంపీల్లో చాలామంది సోషల్ నెట్వర్కింగ్ సైట్లను సమర్థవంతంగా వినియోగించుకోవడం లేదని కూడా తేలింది. ఎంపీల్లో సింహభాగం ట్విట్టర్ ఖాతాలు లేవని చర్చలో తేలింది. అంతేకాదు 43 మంది భాజపా ఎంపీలకు ఫేస్ బుక్ ఖాతాలు లేవని కూడా ప్రధాని దృష్టికి వచ్చింది. దీనితో నరేంద్ర మోదీ దీనిపైనే వారికి క్లాసులు పీకినట్లు చెపుతున్నారు. ఒక్కో ఎంపీకి కనీసం మూడు లక్షల మంది ఫాలోయర్లు ఉండాలని టార్గెట్ విధించినట్లు సమాచారం.
 
వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికి టెక్నాలజీని ఉపయోగించుకోకుంటే వెనుకబడిపోతామని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందువల్ల ప్రతి ఒక్క భాజపా ఎంపీ ఖచ్చితంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఖాతాలను తెరిచి దాని ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహనకు తీసుకురావాలని తెలిపారు.