శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (17:23 IST)

కాశ్మీర్‌ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటాం.. ఇంచ్ వదలం: బిలావల్ భుట్టో

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో జర్దారీ కాశ్మీర్ అంశంపై సంచలనం వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కాశ్మీర్‌ మొత్తాన్ని వెనక్కి తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ముల్తాన్ ప్రాంతంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు.
 
‘కాశ్మీర్‌ను తిరిగి వెనక్కు తీసుకువస్తాను. ఏ ఒక్క అంగుళాన్ని వదిలిపెట్టం. ఎందుకంటే, అది పాకిస్థాన్ లోనిది' అని బిలావల్ భుట్టో అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ, రజా పర్వేజ్ అష్రఫ్‌లు అతడికి ఇరువుపులై ఉన్నారు.
 
2018లో జరగనున్న ఎన్నికల్లో బిలావల్ పోటీ చేయనున్నాడు. అదే సమయంలో తన పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రజలను రెచ్చగొట్టేందుకే బిలావల్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేతలు భారత్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని చెప్పుకుంటూనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం