శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (06:08 IST)

దేశంలో ఏకకాలంలో ఎన్నికలు : మోడీ ప్రతిపాదనకు ప్రణబ్ మద్దతు

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ప్రతీపాదనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంపూర్ణ మద్దతు లభించింది. ప్రధాని పిలుపునకు కొద్దికాలం క్రితమే ఎన్నికల కమిషన్ సానుకూలత వ

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ప్రతీపాదనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంపూర్ణ మద్దతు లభించింది. ప్రధాని పిలుపునకు కొద్దికాలం క్రితమే ఎన్నికల కమిషన్ సానుకూలత వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. అలాగే దేశంలోని పలు ప్రధాన పార్టీలు మోడీ ఫార్ములాకు గతంలోనే సానుకూలంగా స్పందించాయి. 
 
తాజాగా రాష్ట్రపతి మద్దతు కూడా లభించడంతో ప్రధాని ప్రతిపాదన త్వరలోనే ఆచరణకు నోచుకునే అవకాశం ఉంది. వాస్తవానికి దేశంలో ఎప్పుడు చూసినా ఎన్నికలు జరుగుతుండటంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. దీనికితోడు ఎన్నికలే పరమావధిగా నేతలు రాజకీయం చేస్తున్నాయి. 
 
ఈ రాజకీయం వల్ల అనేక ఇబ్బందులతో పాటు సమస్యలు ఎదురవుతున్నాయి. ఖర్చు కూడా తడిసి మోపెడవుతోంది. ఈ తరుణంలో ప్రధాని మోడీ ఫార్మాలాకు రాష్ట్రపతి మద్ధతు కూడా లభించడంతో దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.