గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (12:25 IST)

క్షమాభిక్షనా... ప్రసక్తేలేదు.. మెర్సీ పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతిగా తొలి మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఏడుగురిని మందిని సజీవ దహనం కేసులో ఉరిశిక్ష పడిన ముద్దాయి దాఖలు చేసుకున్న మెర్సీ పిటిషన్‌ను ఆయన

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతిగా తొలి మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఏడుగురిని మందిని సజీవ దహనం కేసులో ఉరిశిక్ష పడిన ముద్దాయి దాఖలు చేసుకున్న మెర్సీ పిటిషన్‌ను ఆయన కొట్టిపారేశారు. దీంతో ఆ కసాయిని ఉరిశిక్షను అమలు చేయనున్నారు.
 
బీహార్ జిల్లాలోని వైశాలి జిల్లాలో 2006లో రఘోపూర్ బ్లాక్‌కు చెందిన విజేంద్ర మహతో, ఆయన కుటుంబ సభ్యులను అతి దారుణంగా హత్య చేసి సజీవదహనం చేశాడు. ఈకేసులో 2013లో జగత్‌ రాయ్‌ అనే వ్యక్తికి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. 
 
అయితే తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఈ యేడాది ఏప్రిల్‌ 23వ తేదీన జగత్‌ రాయ్‌ రాష్ట్రపతి కోవింద్‌కు విజ్ఞప్తి చేసుకున్నాడు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన రాష్ట్రపతి దాన్ని తిరస్కరించారు. దీంతో ఆ ముద్దాయికి త్వరలోనే ఉరిశిక్షను అమలు చేయనున్నారు.