Widgets Magazine

కొడుకు వీర్యంతో ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (16:44 IST)

sperm donation

అమ్మ ప్రేమకు అవధులు లేవనే విషయం మరోమారు నిరూపితమైంది. చనిపోయిన కొడుకు వీర్యంతో పండంటి మనుమలను ఆ తల్లి పొందింది. కొడుకు మీదున్న ప్రేమ.. తన కళ్ల ముందు లేడన్న బాధతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల క్రితం బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయిన తన కొడుకు మధుర స్మృతులను ఎలాగైనా గుర్తుంచుకోవాలన్న ఆశతో.. పెళ్లికాని తన కొడుకు వీర్యాన్ని తీయించి భద్రపరిచి.. ఇప్పుడిలా అతడి వారసులను తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడుతోంది. ఈ ఆసక్తికర పరిణామం పుణెలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పూణె పట్టణానికి చెందిన ప్రథమేశ్ (27) ఉద్యోగ రీత్యా జర్మనీలో నివశిస్తూ వచ్చాడు. 2013లో అతడికి ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. కీమోథెరపీ చేస్తే సంతాన లేమి సమస్యలు తలెత్తే ప్రమాదముందని గ్రహించిన వైద్యులు.. అతడి అనుమతితో వీర్యాన్ని తీసుకుని భద్రపరిచారు. అదే యేడాది సెప్టెంబరులో అతడికి కీమోథెరపీని ప్రారంభించారు. అయితే, 2016 సెప్టెంబరులో కీమోథెరపీ తీసుకుంటూనే పుణెలో చనిపోయాడు.
 
అతడి మరణంతో కలత చెందిన అతడి తల్లిదండ్రులు.. జర్మనీలో భద్రపరిచిన వీర్యాన్ని తీసుకుని.. ఇప్పుడు పండంటి మగ కవలలను అతడికి గుర్తుగా పొందారు. దీనిపై అతడి తల్లి రాజశ్రీ పాటిల్ స్పందిస్తూ, చదువులో అతడు చాలా దిట్ట అని, అలాంటి తన కొడుకుకు బ్రెయిన్ కేన్సర్ అని తెలిసి కుమిలిపోయామని, కీమోథెరపీ తీసుకునేటప్పుడు అతడి చూపు కూడా పోయిందని కన్నీరు కారుస్తూ చెప్పింది. కీమోథెరపీ ప్రారంభానికి ముందు భద్రపరిచిన అతడి వీర్యం ద్వారా మనుమలను పొందాలని నిశ్చయించుకున్నామని చెప్పారామె. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసి జర్మనీ నుంచి వీర్యాన్ని తీసుకొచ్చి.. ఐవీఎఫ్ కోసం పుణె - అహ్మద్‌నగర్ రోడ్‌లోని సహ్యాద్రి ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు. 
 
ప్రథమేశ్ వీర్యం సేకరించాక... అండదాతల కోసం ఆస్పత్రి వైద్యులు గాలించారు. వారి రంగు, ముఖ చిత్రాలకు సరిపోలే అండాన్ని సేకరించి అతడి వీర్యం ద్వారా నాలుగు పిండాలను సృష్టించారు. ఆ పిండాలను మోసేందుకు అతడి తల్లి రాజశ్రీనే సిద్ధపడగా, ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అది సాధ్యపడలేదు. దీంతో అతడి చిన్నమ్మ (తల్లి కజిన్) ఆ పిల్లలను తన కడుపులో మోసేందుకు అంగీకరించారు. సోమవారం ఉదయం ఇద్దరు పండంటి కవలల పిల్లలకు జన్మనిచ్చింది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నవ్యాంధ్ర కోసం చంద్రబాబు - పవన్‌ల చర్యలు ఫలించేనా?

నవ్యాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేయింబవుళ్లు కృషి ...

news

తిరుపతిలో రిలయన్స్ ఎలక్ట్రానిక్ పార్క్ : ముఖేష్ - చంద్రబాబుల భేటీ వీడియో

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నారు. ...

news

అవును పోర్న్‌స్టార్‌కి రూ.83 లక్షలు చెల్లించా: డొనాల్డ్ ట్రంప్ లాయర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత లాయర్ మైఖేల్ కోహెన్ బాంబు పేల్చారు. ఒకప్పుడు ...

news

భార్య పుట్టింటికి వెళ్లిందనీ ఒకరు... పెళ్లి కాలేదనీ మరొకరు... సూసైడ్

ఇటీవలికాలంలో చిన్నపాటి విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా తనను ...

Widgets Magazine