Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమెరికాలో గన్‌కల్చర్... సస్పెండ్ చేశారనీ సహచరులను కాల్చి చంపిన విద్యార్థి

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (08:41 IST)

Widgets Magazine
florida school boy

అమెరికాలో గన్‌కల్చర్ మరోమారు పడగవిప్పింది. ఉన్మాదిగా మారిన ఓ విద్యార్థి సహచర విద్యార్థిని తుపాకీతో కాల్చిచంపాడు. ఈ దుశ్చర్యలో మొత్తం 17 మంది మృత్యువాతపడగా, మరికొందరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. 
 
ఫ్లోరిడా రాష్ట్రం పార్క్‌ల్యాండ్‌లోని మార్జోయ్‌ స్టోన్‌మన్‌ డగ్లస్‌ పాఠశాలలో చదువుతున్న నికోలస్‌ క్రజ్‌(19)పై కొద్దిరోజుల క్రితం పాఠశాల యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుని, అతడిని సస్పెండ్ చేసింది. దీంతో కోపంతో రగిలిపోయిన క్రజ్.. గన్ చేతపట్టుకుని పాఠశాలలోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురిని కాల్చేశాడు. 
 
అనంతరం పాఠశాలలోని ఫైర్ అలారం మోగించాడు. దీంతో ఏదో జరిగిపోతుందన్న కంగారులో అందరూ ప్రవేశ ద్వారం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడే కాచుకుని ఉన్న క్రజ్.. వచ్చిన వారిని వచ్చినట్లు కాల్చి చంపేశాడు. అయితే అప్పటికే కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో దుండగుడు పాఠశాల భవనంలో దాక్కున్నాడు. అనంతరం పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు కూడా దుండగుడిపై ఎదురు కాల్పులకు దిగారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వివాహేతర బంధానికి అడ్డొస్తుందనీ గర్భిణీని చంపి.. స్టోన్ కట్టర్‌తో ముక్కలు చేశారు...

హైదరాబాద్ నగరంలో కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ వద్ద లభ్యమైన వివాహిత(గర్భిణి) మృతదేహం ...

news

ఆయన ఎంపీ కాదు.. విజిటింగ్ ప్రొఫెసర్ : బీజేపీ ఎంపీలు సెటైర్లు

లోక్‌సభ వేదికగా చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించిన అధికార ...

news

కాంగ్రెస్ పార్టీ మనకు బాగా కలిసొస్తుంది - కోదండరాంతో రేవంత్ రెడ్డి

టిఆర్ఎస్ పైన పోరాటం చేస్తూ తనదైన రీతిలో ముందుకు దూసుకుపోతున్నారు జెఎసీ ఛైర్మన్ కోదండరాం. ...

news

పకోడీల వ్యాపారానికి లోను ఇప్పించండి.. స్మృతి ఇరానీకి బీజేపీ కార్యకర్త లేఖ

పకోడీలు అమ్ముకోవడం కూడా ఓ ఉపాధేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ముహుర్తాన వ్యాఖ్యానించారో ...

Widgets Magazine