Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సబార్డినేట్‌ భార్యతో రాసలీలలు... కటకటాల వెనక్కి కల్నల్

శుక్రవారం, 3 నవంబరు 2017 (16:38 IST)

Widgets Magazine
Colonel caught

సబార్డినేట్ భార్యతో రాసలీలలు నెరిపిన కల్నల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఇది ఇండియన్ ఆర్మీలో పెను సంచలనంగా మారిన విషయం తెల్సిందే. గత నెల 26వ తేదీన లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇంట్లో ఆయన భార్యతో ఉన్న కల్నల్‌ను మిలటరీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం భటిండాలోని సైనిక ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇచ్చిన సమాచారంతోనే ఆయన ఇంట్లో సోదాలు చేసి వారిద్దరినీ అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
 
కాగా, నిందితుడు భటిండా జోన్లో అడిషనల్ చీఫ్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. అతడితో పాటు మరో వ్యక్తి లెఫ్టినెంట్ కల్నల్‌ (సబార్డినేట్)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓసారి స్నేహపూర్వకంగా ఇంటికి వచ్చి అతడి భార్యపై కన్నేశాడు. మెల్లగా ఆమెతో స్నేహం పెంచుకుని అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. లెఫ్టినెంట్ కల్నల్ పనిపై చండీగఢ్ వెళ్లడంతో అదే అదనుగా అతడి భార్య వద్దకు వచ్చేశాడు. 
 
తన భార్య తీరుపై అనుమానం వచ్చిన లెఫ్టినెంట్ కల్నల్ మిలటరీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు అర్థరాత్రి సమయంలో ఇంటికి వచ్చి వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి పరీక్ష చేశారు. కాగా సహోద్యోగి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఆర్మీలో తీవ్రమైన నేరం. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి శిక్ష విధించాలన్నది సైనిక కోర్టు నిర్దేశించనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సచివాలయానికి రాని ఏకైక సీఎం కేసీఆర్... తెరాస నేత పోట్ల

ముఖ్యమంత్రి కేసీఆర్‌‍, ఆయన సారథ్యంలోని తెరాస ప్రభుత్వ పాలనపై తెరాస సీనియర్ నేతల్లో ఒకరైన ...

news

ప్రియురాలి రిసెప్షన్‌కు వచ్చి వధువుతో పరార్.. పెళ్ళికొచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది?

తాళికట్టే సమయానికి పెళ్లాగిపోయింది. అంతే పెళ్లికొచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది. ఈ ఘటన ...

news

జగన్‌తో లగడపాటి ఏకాంత భేటీ... వైకాపాలో చేరేనా?

రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురించి ...

news

లింగభేదం కొంపముంచింది.. దిగజారిన భారత్.. కారణం ఏమిటో తెలుసా?

లింగభేదమే భారత్ కొంపముంచింది. భారత ర్యాంకును దిగజార్చింది. అవును. ప్రపంచ ఆర్థిక ఫోరం ...

Widgets Magazine