శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 11 మార్చి 2017 (10:02 IST)

#PunjabElection2017 : కాంగ్రెస్ ముందంజ... సిద్ధూ లీడింగ్ ... ఆప్ ఆశలు గల్లంతు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాలకుగాను మూడు రాష్ట్రాల్లో ముందంజలో ఉంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాల్ల

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాలకుగాను మూడు రాష్ట్రాల్లో ముందంజలో ఉంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాల్లో బీజేపీ దూసుకెళుతోంది. అయితే, పంజాబ్ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ - ఆప్‌ల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. 
 
ఇప్పటివరకు వెల్లడైన ప్రాథమిక ట్రెండ్ మేరకు మొత్తం 117 సీట్లున్న పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 60 చోట్ల, ఆమ్ ఆద్మీ పార్టీ 23, బీజేపీ కూటమి 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో పంజాబ్ రాష్ట్రం మరోమా
రు కాంగ్రెస్ పార్టీ వశం కానుంది. 
 
కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవజ్యోత్ సింగ్ సిద్దూ ఆధిక్యంలో దూసుకెళుతుండగా, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు. అలాగే, లంబి స్థానంలో సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంమీద పంజాబ్‌లో కాంగ్రెస్-ఆప్ మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది.