దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్రిస్మస్ శుభాకాంక్షలు

సోమవారం, 25 డిశెంబరు 2017 (13:35 IST)

Merry Christmas
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు క్రిస్మస్‌ పర్వదిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రిస్మస్‌ సమాజంలో  సుఖశాంతులు తీసుకురావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు వెల్లడించారు.
 
అలాగే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మెదక్ చర్చిలో ఉదయం నుంచే ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమైనాయి. చర్చిలో ప్రార్థనలకు క్రిస్టియన్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని చర్చిల్లో అర్థరాత్రి నుంచే ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ గీతాలు అలరిస్తున్నాయి.
 
చర్చిల ముందు క్రిస్మస్ చెట్లు కూడా క్రిస్టియన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక.. నగరంలోని సికింద్రాబాద్‌లో ఉన్న పలు చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని దానవాయిగూడెంలోని చర్చిలో క్రిస్మస్ ప్రార్థనలు జరుగుతున్నాయి.దీనిపై మరింత చదవండి :  
Christmas Wishes Jesus Narendra Modi Venkaiah Naidu Ram Nath Kovind

Loading comments ...

తెలుగు వార్తలు

news

వాజ్‌పేయికి రాష్ట్రపతి, మోదీ, చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

భారతరత్న, బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టిన రోజును ...

news

ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాలు.. చిన్నమ్మ హర్షం.. ప్రభుత్వం కూలిపోతుందా?

తమిళనాట ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక ఫలితాలు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. దివంగత జయలలిత ...

news

భర్త నచ్చలేదు.. మూడు నెలల గర్భవతి.. ఉరేసుకుని ఆత్మహత్య

ప్రేమ వివాహాలు, అక్రమ సంబంధాలు నేరాలకు కారణమవుతున్నాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం ...

news

ఫిలిప్పీన్స్‌‌ను కుదిపేసిన టెంబిన్- బస్సు ప్రమాదంలో 20 మంది మృతి (Video)

ఫిలిప్పీన్స్‌ను టెంబిన్ అనే తుఫాను ముంచేసింది. పెను తుఫాను అయిన టెంబిన్‌ జల ప్రళయానికి ...