Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎనీ టైమ్ బ్యాన్... రూ.2 వేల నోటు రద్దేనా?

గురువారం, 21 డిశెంబరు 2017 (08:49 IST)

Widgets Magazine
rupe note

దేశంలో పెద్ద నోట్ల రద్దుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు ప్రకటన చేయనున్నారా? అవుననే అంటున్నాయి... ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు వర్గాలు. గత యేడాది రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెల్సిందే. వీటి స్థానంలో కొత్త రూ.2000 నోటు, రూ.500 నోట్లను ప్రవేశపెట్టారు. అయితే, ఇపుడు రూ.2 వేల నోటును కూడా రద్దు చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
ఇప్పటికే రిజర్వ్‌బ్యాంకు 2000 రూపాయల నోట్ల పంపిణీని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెపుతోంది. ఈ మధ్య లోక్‌సభలో ఆర్థికశాఖ ప్రవేశపెట్టిన నివేదికను, రిజర్వ్‌బ్యాంకు వార్షిక నివేదికను పక్కపక్కన పెట్టి అధ్యయనం చేసినపుడు ఈ విషయం స్పష్టమయ్యిందని తమ నివేదికలో పేర్కొంది. 
 
"పెద్ద నోట్ల రద్దు అనంతరం వెంటనే మార్కెట్లో ద్రవ్య లభ్యత కోసం రూ.2,000 నోట్లు తీసుకురాగా, లావాదేవీలపరంగా సవాళ్లకు దారితీసింది. దీంతో ఆర్‌బీఐ రూ.2,000 నోట్లను ప్రింట్‌ చేయడం ఆపి ఉంటుంది. లేదా తక్కువ సంఖ్యలో ముద్రించి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో చిన్న నోట్ల వాటా 35 శాతానికి చేరింది" అని నివేదిక స్పష్టం చేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

బిజినెస్

news

గుజరాత్ రిజల్ట్స్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల ఓట్ల లెక్కింపు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం ...

news

కొండెక్కిన ఉల్లి ధరలు … 220 శాతం పెరుగుదల

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కాయి. ఫలితంగా కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ...

news

ఒక్క రూపాయికే విమాన టిక్కెట్!

కేవలం ఒక్క రూపాయికే విమాన టికెట్టా..? ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అవును. ఇది నిజమే. దేశీయ ...

news

ఆర్థిక సంక్షోభంలో పాక్... దారుణంగా పడిపోయిన మారకం విలువ

చిరకాల మిత్రదేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకోనుంది. ఆ దేశ రూపాయి విలువ దారుణంగా ...

Widgets Magazine