శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2016 (17:26 IST)

గేటు లోపలకు వచ్చిన నాగుపాము.. తోక పట్టుకుని గిరగిరా తిప్పేసిన కుక్క.. ఆ తర్వాత ఏమైంది?

శునకాలకు విశ్వాసం ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. యజమానుల పట్ల వాటికున్న విశ్వాసానికి సాటిలేదు. దొంగలు, ఆచూకీ తెలియని వ్యక్తుల్ని ఇంటిపక్కకు కూడా శునకాలు చేర్చవు. కానీ దొంగలకు బదులు ఓ పాము ఇంట్లోకి

శునకాలకు విశ్వాసం ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. యజమానుల పట్ల వాటికున్న విశ్వాసానికి సాటిలేదు. దొంగలు, ఆచూకీ తెలియని వ్యక్తుల్ని ఇంటిపక్కకు కూడా శునకాలు చేర్చవు. కానీ దొంగలకు బదులు ఓ పాము ఇంట్లోకి చొరబడాలని చూస్తే శునకాలు అడ్డుకున్న ఘటన తమిళనాడు, ధర్మపురిలో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... ధర్మపురి జిల్లాలోని వెల్లలాపట్టి అనే గ్రామంలోని ఓ ఇంటికి సమీపంలో నాగుపాము వచ్చింది. గేటులో ప్రవేశించింది. అంతే కుక్కలు ఆ పామును అడ్డుకున్నాయి. పామును చూసి అరవడం ప్రారంభించిన కుక్కలతో పాము కూడా పోరాడింది. నాగుపామును ఇంట్లోకి వెళ్లనీయకుండా ముందుగా ఓ కుక్క మాత్రమే అడ్డుకుంటే.. ఆపై మరో రెండు శునకాలు సైతం దానికి తోడై పామును ఆటాడుకున్నాయి. 
 
వీటిలో ఓ శునకమైతే పాము తోకను పట్టుకుని గిరగిరా తిప్పేసింది. అప్పటికీ ఆ నాగుపాము శునకాలపై పడగవిప్పి కరిచేందుకు ప్రయత్నించింది. కానీ ఆ పాము శునకం బారిన పడక తప్పలేదు. చివరికి శునకం కరిచి ఆ పాము చనిపోయింది. ఇప్పటివరకు ఆ కుక్క ఏడు పాములను ఇలా కరిచి చంపిందని స్థానికులు చెప్తున్నారు.