Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ముఖేష్ అంబానీ ప్రకటనతో రూ.3వేల కోట్ల పతనం: 3 నెలల్లో 900 కోట్ల జియో కాల్స్‌ బ్లాక్ చేశాయట..!

శుక్రవారం, 2 డిశెంబరు 2016 (12:20 IST)

Widgets Magazine

ప్రముఖ వ్యాపార వేత్త ,రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మొబైల్ డేటా రంగంలో కొత్తగా ప్రవేశపెట్టిన జియో ఆఫర్‌ను పొడిగిస్తూ గురువారం 25 నిమిషాల పాటు చేసిన ప్రసంగంతో దేశంలోని ప్రత్యర్థి టెలికాం కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. ఈ పతనం మొత్తం విలువ సుమారు రూ.3వేల కోట్లు అని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
భారతీయ టెలికాం రంగంలో ‘రిలయన్స్‌ జియో’ రాక టెలికామ్ రంగాన్ని ఓ ఊపు ఊపేసింది. డిసెంబర్‌ 30 వరకు ఉచిత వాయిస్‌ కాల్స్‌, డేటా ఆఫర్‌ను ప్రకటించడంతో ఆ నెట్‌వర్క్‌ సిమ్‌ల కోసం జనాలు బారులు తీరారు. తాజాగా ఈ ఆఫర్‌ను ‘హ్యాపీ న్యూ ఇయర్‌’గా నామకరణం చేసి 2017 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. పాత చందాదారులకూ ఇది వర్తిస్తుందని అని ముకేశ్‌ అంబానీ చేసిన ప్రకటన తో దేశీయ మార్కెట్లో ముఖ్యంగా ప్రత్యర్థి టెలికాం షేర్ల పాలిట శాపమైంది. ఫలితంగా ఐడియాతో ఇతర టెలికాం కంపెనీల షేర్లు పడిపోయాయి. 
 
మరోవైపు ముఖేష్ అంబానీ పనిలో పనిగా తన ప్రసంగంలో ఇతర టెలికాం సంస్థలపై చిర్రుబుర్రుమన్నారు. ఎయిర్‌టెల్‌, ఐడియా, వోడాఫోన్‌లు జియోకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా జియో నుండి వచ్చే కాల్స్‌ను తమ కస్టమర్లకు కనెక్ట్‌ చేయకుండా అడ్డుకుంటున్నాయన్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎయిర్‌టెల్‌, ఐడియా, వోడాఫోన్‌లు దాదాపుగా 900 కోట్ల జియో కాల్స్‌ను బ్లాక్‌ చేయడం జరిగిందని, పోటీ తత్వం తట్టుకోలేక ఇలాంటి పనులు వారు చేస్తున్నట్లుగా ముఖేష్‌ అంబానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల్లోనే 900 కోట్ల కాల్స్‌ను బ్లాక్‌ చేసిన ఆ కంపెనీలు ఇకపై అయినా తమ తప్పుడు ప్రవర్తనను సరిదిద్దుకోవాలని కోరారు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కొత్త కరెన్సీ నోట్లపై కొత్త డౌట్లు... జంతువుల కొవ్వుతో చేశారా? చిప్ పెట్టాలనుకున్నా కానీ వ్యయం?

కొత్త కరెన్సీ నోట్లపై కొత్త కొత్త విషయాలు పుట్టుకొస్తున్నాయి. దేశంలోకి కొత్త కరెన్సీ ...

news

పారికర్ కళ్లు పీకేస్తారా?రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉగ్రదాడులు తప్పవ్: ఫరూక్ అబ్ధుల్లా

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ...

news

ఖాతాదారులకు మజ్జిగ, మంచినీరు.. ఆ ఘటనపై క్షమాపణ చెప్తున్నా: డీజీపీ

పెద్ద నోట్ల రద్దుతో ఆంధ్రప్రదేశ్‌‌లో నోట్ల కష్టాలు తీవ్రమయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంలలో ...

news

సంపన్న మహిళకు బెదిరింపులు.. రూ.2కోట్లు ఇవ్వకపోతే.. ఆ ఫోటోలను పోర్నోగ్రాఫిక్ సైట్లలో?

మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా భోపాల్‌లో ఓ మహిళ తీవ్ర ...

Widgets Magazine