Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రివాల్వర్ రాణి.. వరుడి తలకు గురిపెట్టింది.. స్కార్పియోలో కిడ్నాప్ చేసుకెళ్లింది..

బుధవారం, 17 మే 2017 (18:52 IST)

Widgets Magazine
gunshot

కళ్యాణ మండపంలో సినీ ఫక్కీలో ఓ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ సీన్ ఏ సినిమాలో ఉందో తెలియదు కానీ.. కాసేపట్లో వివాహం జరుగుతుందనే ఆనందంలో అందరూ కోలాహలంగా ఉన్న కల్యాణ మండపానికి ఓ స్కార్పియో వాహనంలో ఓ రివాల్వర్ పట్టుకుని దిగిన 25 ఏళ్ల యువతి డైరెక్టుగా మండపం పైకి ఎక్కి, వరుడి తలకు గురిపెట్టింది. దీంతో పెళ్లికొచ్చిన అతిథులంతా షాక్ అయ్యారు.
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగింది. వరుడి తలకు ఆ యువతి గురిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే..? వరుడు ముందు ఆమెను ప్రేమించి.. ఆపై మోసం చేసి మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించడమే. అందుకే ఈ పెళ్లిని జరగనివ్వనని.. తలకు గురిపెట్టి.. వరుడిని తనతో పాటు తీసుకెళ్లింది సదరు యువతి. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా వాహనంలో వచ్చినట్లు బంధువులు తెలిపారు.
 
రివాల్వర్‌తో బెదిరించి వరుడిని తీసుకెళ్లిన యువతితో ప్రేమాయణం నిజమేనని.. వారిద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని వరుడు పనిచేసే ప్రాంతానికి చెందిన స్థానికులు అంటున్నారు. ఆపై తల్లిదండ్రుల ఒత్తిడితో వారు కుదిర్చిన అమ్మాయిని వివాహం చేసుకునేందుకు ఆ యువకుడు సిద్ధపడినట్లు సమాచారం. కాగా, తన కుమారుడు పని చేస్తున్న ప్రాంతానికి ఇటీవల వెళ్లిన తనను ఇంటికి పిలవలేదని, ఓ గుడిలో కలసి, హోటల్‌లో భోజనం పెట్టించి వెనక్కు పంపాడని, అప్పుడే తనకు అనుమానాలు వచ్చాయని వరుడి తండ్రి రామ్హేత్ యాదవ్ తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Wedding Kidnaps Groom Uttar Pradesh Revolver Rani

Loading comments ...

తెలుగు వార్తలు

news

తాజ్‌మహల్ వద్ద పాము... టూరిస్టులు పరుగో పరుగు.. నీళ్లు తాగడానికి వచ్చిందట...

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ వద్ద పాము కలకలం సృష్టించింది. దాదాపు ఆరు అడుగులు పొడవున్న ...

news

మాకు కావాల్సింది చెత్త కాదు.. అర్హుల‌ైన అనలిస్ట్స్ కావాలి : పవన్ కళ్యాణ్

పార్టీ సేవల కోసం అర్హులను ఎంపిక చేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళంలో ...

news

భార్యపై అనుమానం... తమిళనాడు ఎక్స్‌ప్రెస్ నుంచి భార్యను తోసేసిన భర్త

అనుమానం పెనుభూతమైంది. ఇంట్లోనే కాదు చివరకు రైలు ప్రయాణంలో కూడా ఈ అనుమానం వదల్లేదు. దీంతో ...

news

పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానం ఏంటో తెలుసా?

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం తథ్యమని తేలిపోయింది. ...

Widgets Magazine