Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆర్కే నగర్‌ చూశారుగా మామా... ఇప్పటికైనా 'సై' అనండి... రజినీ అల్లుడు

బుధవారం, 6 డిశెంబరు 2017 (16:16 IST)

Widgets Magazine
Dhanush

మామయ్య.. ఒక్కసారి ఆలోచించండి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు రాజకీయాల్లోకి రావడమే మంచిది. తమిళనాడు రాజకీయాలను శాసించే స్థాయి ఇప్పుడెవరికీ లేదు. నిజమైన తలైవర్ (నాయకుడు) మీరు. మీవల్ల రాజకీయం చేయడం సాధ్యమే. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల్లో మీకు అభ్యర్థులు కావాల్సినంతమంది వస్తారు. మీరు దేనికీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇదంతా మామ రజినీకాంత్‌కు ధనుష్ ఇచ్చిన రాజకీయ సలహా. 
 
అల్లుడు ధనుష్‌ అంటే రజినీకి ఎంతో ఇష్టం. తన పని తానేంటో చేసుకుని వెళ్ళిపోతుంటాడు ధనుష్‌. ఎవరి విషయంలోను, ఎవరి గురించి ఎక్కడా మాట్లాడని వ్యక్తి ధనుష్‌. ఎవరి రికమెండేషన్ లేకుండా సొంతంగా తన స్వయంకృషితో తమిళనాడు సినీ పరిశ్రమలో ఒక గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి ధనుష్‌. అలాంటి వ్యక్తి సూపర్‌స్టార్ రజినీకి అల్లుడయ్యాడు. రజినీ ఎప్పటినుంచో రాజకీయాల్లోకి రావాలనుకుంటూనే ఉన్నారు. అయితే వెనకడుగు వేసుకుంటూ ఎప్పుడు వెళదామో తెలియక సైలెంట్‌గా ఉండిపోతున్నారు. 
 
సినీ హీరో విశాల్ ఆర్కే నగర్ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయాలనుకోవడం, ఆయన నామినేషన్ తిరస్కరణకు గురవడం... తదితరాలన్నీ లోతుగా పరిశీలిస్తున్న ధనుష్‌‌కు తన మామ గుర్తుచ్చాడు. మీరు రాజకీయాల్లోకి వచ్చి వుంటే ఇప్పుడు ఆర్.కే.నగర్ నియోజకవర్గం మనదే అయ్యిండేది మామ. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్కసారి బాగా ఆలోచించండి. మనం రాజకీయాల్లోకి వెళదాం. దానికదే అన్నీ చక్కదిద్దుకుంటాయని మరోసారి సలహా ఇచ్చాడట. గతంలోనే ధనుష్‌ రజినీకి సలహాలు ఇచ్చారు. అయితే అన్నీ ఆలోచిస్తూ అలాగే వుండిపోయిన రజినీ ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని కుటుంబ సభ్యుల నుంచే ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితుల్లో మరింత ఆలోచనలోకి వెళ్ళిపోయారు. 
 
అల్లుడు చెప్పిన విషయానికి మెల్లగా నవ్వి సరేనంటూ వెళ్ళిపోయారట రజినీ. అయితే ధనుష్‌ మాత్రం తన మామ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారన్న నమ్మకంలో ఉన్నారు. మరి చూడాలి... రజినీ అల్లుడు చెప్పిన మాటలను శిరసావహిస్తారో లేక సైలెంట్‌గా సినిమానే జీవితంగా చివరి వరకు గడుపుతారో.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దైవ ప్రార్థనలో భర్తతో పోటీపడలేక భార్య సూసైడ్

కొందరికి తమ ఇష్టదైవమంటే చచ్చేంత ప్రేమ... పిచ్చి. ఆ మైకంలో వారు ఏం చేస్తున్నారో కూడా ...

news

అమ్మ చనిపోయిన రోజునే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది : విశాల్

చెన్నై, ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు సినీ నటుడు విశాల్ దాఖలు చేసిన ...

news

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త మర్మాంగంపై వేడివేడి నూనె పోసిన భార్య!

అక్రమ సంబంధం మంచిది కాదనీ, సంసారాలు కూలిపోతాయనీ, అందువల్ల ఆ చెడు పని మానుకోవాలంటూ పదేపదే ...

news

రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డొస్తుందనీ... కన్నబిడ్డను చంపేసింది

రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డొస్తుందని భావించిన ఓ కసాయి తల్లి తన రెండేళ్ళ బిడ్డను హత్య ...

Widgets Magazine