Widgets Magazine

విశాల్‌కు టీటీవీ దినకరనే డబ్బులిచ్చి ఆర్కే నగర్‌కు పంపించారట

మంగళవారం, 5 డిశెంబరు 2017 (15:27 IST)

నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, నిర్మాత సంఘం అధ్యక్షుడు, నటుడు అయిన విశాల్ ఆర్కే నగర్ ఎన్నికల బరిలోకి దిగారు. మంగళవారం ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై అంటూ నామినేషన్ దాఖలు చేశారు. కానీ నామినేషన్‌లో విశాల్ ఇచ్చిన హామీలు, ఆస్తుల వివరాలు సరిగ్గా లేవని తెలిసింది. దీంతో నామినేషన్‌ను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.

విశాల్ నామినేషన్‌ను స్వీకరించకూడదంటూ ఇప్పటికే అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
 
ఇదిలా ఉంటే.. విశాల్‌‌ను టీటీవీ దినకరనే బరిలోకి దించారని ఆర్కే నగర్ అన్నాడీఎంకే అభ్యర్థి, ఆ పార్టీ ప్రిసీడియం ఛైర్మన్‌ మధుసూదనన్‌ ఆరోపించారు. మదుసూదనన్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. విశాల్ కందువడ్డీ వ్యవహారంలో చిక్కుకున్నారని, దానిలోంచి కాపాడుతానని హామీ ఇచ్చి దినకరన్ ఆయనను ఎన్నికల బరిలో దించాడని మధుసూదనన్ ఆరోపించారు.
 
ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో విశాల్ ఖర్చు పెట్టనున్న డబ్బంతా దినకరన్ దేనని ఆయన తెలిపారు. 1991కి ముందు దినకరన్ కుటుంబం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన వద్దకు డబ్బులెలా వచ్చాయని అడిగారు. దీనిపై ఎన్నికల తర్వాత దర్యాప్తు జరుగనుందని తెలిపారు. 
 
ఆర్‌కే నగర్‌లో పోటీ చేసేందుకు సిద్ధమైన నటుడు విశాల్‌ తక్షణం తప్పుకోవాలని తమిళ 'ఆటోగ్రాఫ్' సినిమా దర్శకుడు చేరన్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా విశాల్ స్పందించారు. బెదిరింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

చేరన్ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ కామెంట్‌ పోస్ట్‌ చేశారు. ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయడాన్ని తాము జీర్ణించుకోలేక పోతున్నట్టు చెప్పారు. ఆయన ఎవరి ప్రోద్బలంతోనో పోటీ చేస్తున్నారని, ఫలితంగా ఆయన బలిపశువు కానున్నారన్నారు.
   
నిర్మాతల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విశాల్‌ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి తక్షణం రాజీనామా చేయాలని చేరన్ డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తమిళ చిత్రపరిశ్రమ అనేకమంది అశోక్‌కుమార్‌లను చూడాల్సి వస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన విశాల్.... చేరన్‌కు ఘాటుగా రిప్లై ఇచ్చారు.

తనపై ఇలాగే ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. సినీ లెజెండ్లు కమల్ హాసన్, రజనీకాంత్‌కు పోటీగా తాను ఎన్నికల బరిలోకి దిగలేదన్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సవతి తల్లి దాష్టీకం.. చితక్కొట్టి గోనె సంచిలో కుక్కింది... (వీడియో)

చండీఘర్‌లో ఓ సవతి తల్లి విచక్షణారహితంగా ప్రవర్తించింది. తన భర్త మొదటి భార్యకు పుట్టిన ...

news

గుజరాత్ పోల్స్ : మోడీకి ముచ్చెమటలు పోయిస్తున్న ముగ్గురు కుర్రోళ్లు

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముగ్గురు యువ నేతలు ...

news

ఆకులు అలములొద్దు.. అన్నం పెట్టమంటే.. భర్తను చితక్కొట్టిన లావు భార్య

ఆహారపు అలవాట్లలో మార్పులు కారణంగా చిన్న వయస్సులోనే ఒబిసిటీ ఆవహిస్తోంది. పెళ్లికి ముందే ...

news

కాపులకు రిజర్వేషన్లు రావడం సాధ్యం కాదా.. ఎందుకు?

కాపు, బలిజ, ఒంటరి, తెలగ వారందరినీ బిసిల్లో చేర్చడమే కాకుండా ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ...