శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 జులై 2015 (13:40 IST)

మేలిరకం జే-34 పత్తితో యాకూబ్‌కు ఉరితాడు.. తాడు మెత్తగా ఉండేందుకు?

ముంబై పేలుళ్ల కేసీలు ఉరిశిక్షకు గురైన యాకూబ్ మెమన్‌కు బీహార్‌లో తయారు చేసిన ఉరితాడును వినియోగించారు. ఈ ఉరితాడును నాగ్‌పూర్ జైలులో అధికారులు యాకూబ్ ఉరితాడు గురించి చెబుతూ.. బీహార్‌లోని బుక్సార్ కేంద్ర కారాగారంలో తయారు చేసినట్లు తెలిపారు. తమ జైలులో తయారైన ఉరితాడును నాగపూర్‌కు పంపించినట్లు బుక్సాల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.కే. చౌదరి తెలిపారు. 
 
మేలిరకం జే-34 పత్తిని వాడి దీన్ని తయారు చేశామని, ఆ తరువాత తాడు మెత్తగా ఉండేందుకు మైనం, అరటి గుజ్జు తదితరాలను వాడామని ఆయన తెలిపారు. తాడులో ఎక్కడా ముడులు ఉండకుండా జాగ్రత్త పడ్డామని వివరించారు.
 
14 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ధనుంజయ్ బెనర్జీని ఉరితీసేందుకు కోల్ కతా జైలు అధికారుల కోరిక మేరకు అప్పట్లో ఇదే తరహా ఉరితాడును పంపామని, ఆపై అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్‌లను ఉరితీసేందుకు వినియోగించిన తాళ్లను కూడా ఇక్కడి ఖైదీల చేతనే తయారు చేయించామని ఆయన వివరించారు.