శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (12:05 IST)

సబ్సిడీ వంట గ్యాస్ ధర సిలిండర్‌కు రూ. 3 పెంపు

దేశంలో సబ్సిడీ వంట గ్యాస్ ధర సిలిండర్‌కు రూ. 3 చొప్పున పెరిగింది. 14.2 కేజీల సిలిండర్‌పై డీలర్లకు చెల్లిస్తున్న కమీషన్‌ను రూ. 40.71 నుంచి రూ. 43.71కు కేంద్రం పెంచడంతో ఆ మేరకు వంట గ్యాస్ సిలిండర్ ధరను కూడా పెంచినట్లు అధికారులు వెల్లడించారు. తాజా పెంపుతో ఢిల్లీలో వంట గ్యాస్ ధర రూ. 414 నుంచి రూ. 417కి పెరగగా ముంబైలో రూ. 448.50 నుంచి రూ. 452కి పెరిగింది. 
 
ఇదిలా ఉంటే డీలర్ల కమీషన్ పెంపు వల్ల సబ్సిడీయేతర (ఏడాదికి 12 సిలిండర్ల కోటాను దాటి వినియోగదారులు కొనుగోలు చేసేవి) 14.2 కేజీల సిలిండర్ ధర సైతం అదే స్థాయికి పెరిగింది. ప్రస్తుతం రూ. 880గా ఉన్న సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ. 883.50కి చేరింది. 
 
డీలర్ల కమీషన్ పెంపు వల్ల దేశవ్యాప్తంగా 13,896 మంది ఎల్పీ జీ డిస్ట్రిబ్యూటర్లకు లబ్ధి చేకూరనుంది. డీలర్ల కమీషన్‌ను చివరిసారిగా 2013 డిసెంబర్‌లో సిలిండర్‌కు రూ. 3.46 చొప్పున పెంచడంతో వారి కమీషన్ రూ. 40.71కి చేరింది.