శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (12:18 IST)

భారత్‌లోని పెద్ద తీవ్రవాద సంస్థ ఆర్ఎస్ఎస్ : మహారాష్ట్ర రిటైర్డ్ ఐపీఎస్

మహారాష్ట్ర పోలీసు శాఖలో ఐజీ స్థాయి ఉన్నతాధికారిగా పనిచేసిన మాజీ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విధ్వంసక చర్యలకు పాల్పడిన ఆరెస్సెస్ ముమ్మాటికీ ఉగ్రవాద సంస్థేనని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్ఎం ముష్రిఫ్ కుండబద్దలు కొట్టారు. 
 
కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... దేశంలోనే నెంబర్‌వన్ ఉగ్రవాద సంస్థ ముమ్మాటికీ ఆర్ఎస్ఎస్సేనని తేల్చి చెప్పారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని మక్కా మసీదు పేలుళ్లతో పాటు మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుళ్లు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌పై బాంబు దాడి వంటి 13 పెను విధ్వంసాలకు ఆ సంస్థ పాల్పడిందని చెప్పారు. ఆర్‌డీఎక్స్‌ను వినియోగించిన సంస్థగానూ ఆరెస్సెస్‌పై కేసులు నమోదయ్యాయని ఆయన గుర్తు చేశారు.