శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (13:46 IST)

శబరిమలై అయ్యప్ప దర్శనానికి మహిళలను అనుమతించలేం : దేవస్థానం

శబరిమలై అయ్యప్ప దర్శనానికి మహిళలను అనుమతించే ప్రస్తక్తే లేదని దేవస్థాన పరిపాలనా కమిటి తేల్చి చెప్పింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్‌ సమర్పించింది. కేరళ శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్యనున్న మహిళల్ని అనుమతించరు. వందల ఏళ్లుగా ఇదే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. ఈ ఆలయంలో మహిళలను అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలైంది. ఇది కోర్టు బెంచ్‌ వద్దకు వచ్చింది. దీంతో దీనిపై స్పందించాలంటూ కేరళ సర్కారును సుప్రీంకోర్టు కోరింది. ఆలయ ప్రవేశంపై స్పందించిన కేరళ ప్రభుత్వం తన వాదనను వెల్లడించింది. 
 
వందల యేళ్ల నుంచి సాగుతున్న విధానాన్ని తాము కొనసాగిస్తామని.. మహిళల్ని శబరిమలైలోని అయ్యప్ప ఆలయంలోకి అనుమతించే ప్రసక్తే లేదని తేల్చేశారు. వందల ఏళ్లుగా సాగుతున్న నిషేధాన్ని రద్దు చేసి.. సంప్రదాయానికి విరుద్దంగా తాము వ్యవహరించలేదని తేల్చి చెప్పింది. శబరిమలై ఆలయంలోకి మహిళల దర్శనం కోసం 2007లో కోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం ఈ అంశం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సంప్రదాయానికి పెద్దపీట వేస్తామని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీ ప్రభుత్వ స్పందనపై సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.