Widgets Magazine Widgets Magazine

శశికళ వెన్నులో వణుకు.. రాత్రంతా ఎమ్మెల్యేలతో గడిపిన చిన్నమ్మ

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (08:53 IST)

Widgets Magazine
sasikala

ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రియనెచ్చెలి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే.శశికళ వెన్నులో వణుకు మొదలైంది. జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమె రెండో నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న జయలలిత గత యేడాది డిసెంబర్ 5వ తేదీన కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ... ఇపుడు ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీపడ్డారు. అయితే, నిన్నామొన్నటి వరకు నమ్మినబంటుగా ఉన్న పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో ఆమె సీఎం పీఠానికి అడుగుదూరంలో వచ్చి ఆగిపోయింది. 
 
ఇంతలో గత యేడాది జూన్ నెలలో ముగిసిన జయలలిత అక్రమాస్తుల కేసులో తుది తీర్పును మంగళవారం వెల్లడించనున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. దీంతో ఆమె వణికి పోయారు. ఆ వెనువెంటనే తన వర్గ ఎమ్మెల్యేలు బస చేస్తున్న కూవత్తూరులోని గోల్డన్ బే రిసార్ట్స్‌కు వెళ్లిపోయారు. సోమవారం రాత్రంతా అక్కడే ఉన్నారు. 
 
మంగళవారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడి కానుంది. ఈ తీర్పు తనకు సానుకాలంగా వస్తే... అక్కడ నుంచి ఎమ్మెల్యేలతో ఊరేగింపుగా చెన్నైలోని పోయెస్ గార్డెన్‌కు తిరిగిరావాలన్న తలంపులో ఉన్నారు. ఒకవేళ కేసులో దోషిగా తేలితే మాత్రం... ఆమెను ఆ రిసార్టులోనే అరెస్టు చేసేందుకు పోలీసులు సర్వసన్నద్ధంగా ఉన్నారు. మొత్తంమీద శశికళ వెన్నులో వణుకుమొదలైంది. Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు వార్తలు

news

టైంబాంబును తలపిస్తున్న తమిళనాడు... కూవత్తూరులోనే శశికళ

అధికార అన్నాడీఎంకేలో చెలరేగిన ఆధిపత్య పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇప్పటివరకు ...

news

దేవుడా ఈ రోజు మాత్రం నాది కానివ్వు... పన్నీర్, శశికళ జాగారపు వేడికోలు

హాలీవుడ్ సినిమాల్లో కూడా చూడనంత టెన్షన్‌ ప్రస్తుతం ఆ ఇద్దరినీ ఆవహించింది. జయలలిత మరణించిన ...

news

ఎమ్మెల్యేల చుట్టూ 600 మంది పోలీసులు: 20వేల పోలీసుల మోహరింపు

ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుతం తమిళనాడు నిరువుగప్పిన నిప్పులా ఉంది. మంగళవారం ఉదయం 11 గంటల ...

news

మీ వల్లే భార్య విడాకులిచ్చింది. పరువు నష్టం కడతారా చస్తారా అన్న భర్త

ఫేస్‌బుక్ మెసేజిలు, వాట్సాప్ మేసేజ్‌లు సంసారాలను నిలువునా కూలుస్తున్నాయన్నది తెలిసిన ...