శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (08:44 IST)

మరో జైలుకు సైనేడ్ మల్లిక... శశికళ జైలు మార్పిడి లేనట్టే...

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను మరో జైలుకు మార్చే ఉద్దేశం కర్నాటక జైలు అధికారులకు లేనట్టుంది. ఎందుకంటే.. శశికళ ఉంటున్న బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉంటున్న సైనేడ్ మల్లికను మరో జ

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను మరో జైలుకు మార్చే ఉద్దేశం కర్నాటక జైలు అధికారులకు లేనట్టుంది. ఎందుకంటే.. శశికళ ఉంటున్న బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉంటున్న సైనేడ్ మల్లికను మరో జైలుకు మార్చడంతో జైలు అధికారుల ఆలోచన తేటతెల్లమైంది. 
 
జయలలిత అక్రమాస్తుల కేసులో  ఏ2 నిందితురాలిగా ఉన్న శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ళ జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల అపరాధం విధించిన విషయం తెల్సిందే. దీంతో ఆమెను బెంగుళూరు జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో పరప్పణ అగ్రహార జైలులో శశికళకు ప్రాణహాని ఉందని తమిళనాడు నిఘా విభాగం పేర్కొన్న నేపథ్యంలో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
శశికళ బ్యారక్‌కు అనుబంధంగా ఉండే మరో గదిలో శిక్ష అనుభవిస్తున్న సీరియల్ కిల్లర్ (వరుస హత్యలు) దోషి సైనేడ్‌ మల్లికను హుటాహుటిన బెళగావిలోని హిండలగా జైలుకు తరలించారు. దీంతో శశికళను ఎలాగైనా చెన్నై జైలుకు మార్చాలని అన్నాడీఎంకే నేతలు ప్రయత్నాలకు తెరపడినట్టే. 
 
మరోవైపు ఆమెకు బెంగళూరు జైలులో ముప్పుందని న్యాయవాదులు కోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. సైనేడ్‌ మల్లికను వేరే జైలుకు తరలించినందున శశికళను చెన్నై జైలుకు మార్చేందుకు కోర్టు సుముఖత తెలుపకపోవచ్చని, అలాగే, జైలు అధికారులు శశికళను మరో జైలుకు మార్చేందుకు సుముఖంగా లేని కారణంగానే సైనేడ్ మల్లికను మరో జైలుకు మార్చినట్టు తెలుస్తోంది.