Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జయలలిత ఫొటో మీద ఒట్టు వేశారు సరే... అసలు ఎమ్మెల్యేలు ఎటువైపు!?

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (07:15 IST)

Widgets Magazine

తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో రాష్ట్ర రాజకీయాలు ఓ కొలిక్కి వస్తాయని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, అసలు రాజకీయం ఇపుడే మొదలైంది. 
 
అక్రమాస్తుల కేసులో తనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే శశికళ అత్యంత వేగంగా పావులు కదిపారు. సుప్రీంకోర్టు తీర్పు ఎటుపోయి ఎటు వస్తుందోననే ఉద్దేశంతో ముందు నుంచే ఆమె తన తర్వాత ఎవరు? అని చర్చలు జరిపారు. 
 
ఎమ్మెల్యేలతో మూకుమ్మడిగానూ, వేర్వేరుగానూ చర్చించారు. తాను కాకపోతే ఎవరైతే బావుంటుందని ఆరా తీశారు. వారిలో అత్యధికులు పళని స్వామి పేరును ప్రతిపాదించారు. చివరకు, మంగళవారం ఉదయం శాసనసభాపక్ష సమావేశంలో సెంగోట్టయ్యన్, పళని స్వామి, జయ మేనల్లుడు దీపక్‌, తన భర్త నటరాజన్ పేర్లను ఆమె ఎమ్మెల్యేల ముందు ఉంచినట్లు సమాచారం.
 
అధిక శాతం ఎమ్మెల్యేలు పళని స్వామివైపే మొగ్గు చూపారు. బయటకు వెళ్లిన తర్వాత ఎమ్మెల్యేలు చేయి జారిపోయే అవకాశం ఉందని భావించిన శశికళ.. శిబిరంలోనే వారికి బ్రెయిన్‌ వాష్‌ చేశారు. నీతులు చెప్పారు. జయలలిత ఫోటోపై ప్రమాణం చేయించుకున్నారు. మూడున్నరేళ్ల పాటు మిన్నకుండాలని సూచించారు. అప్పటివరకు మీకు (ఎమ్మెల్యేలకు) మంచే జరుగుతుందని హామీ ఇచ్చారు. 
 
తనకు పార్టీ గురించి, ప్రభుత్వం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా కేవలం అమ్మ లక్ష్యసాధన కోసమే తాను ఇంతగా పాటుపడుతున్నానని, అందువల్ల ఎమ్మెల్యేలంతా తనకు అండగా నిలవాలని ప్రాధేయపడ్డారు. అలా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత మూడుసార్లు ఎమ్మెల్యేలను బతిమిలాడారు. 
 
ఆ తర్వాత రాత్రి 10.30 గంటల సమయంలో ఆమె ఎమ్మెల్యేల విడిది కూవత్తూరు రిసార్ట్స్ నుంచి పోయెస్ గార్డెన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత మంత్రులు ఓఎస్‌ మణియన్, రాజేంద్ర బాలాజీ వెంట 16 మంది ఎమ్మెల్యేలు కూడా బయటకు పెళ్లిపోవడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Sasikala Spend Tonight Koovathur Resort

Loading comments ...

తెలుగు వార్తలు

news

తమిళనాడు ముఖ్యంత్రి కుర్చీ రేస్ : పళని వర్సెస్ పన్నీర్‌.. నువ్వా నేనా!?

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం అసలైన ఆట ఇపుడు మొదలైంది. ఈ కుర్చీకోసం రాజకీయ చదరంగం ఆడిన ...

news

తీర్పు వెలువడగానే బోరుమన్న శశికళ... నేలపైనే దిగాలుగా కుప్పకూలింది...

జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ...

news

పన్నీర్ ఆశలపై చన్నీళ్లేనా? గవర్నర్‌కు కొత్త పరీక్ష

సుప్రీకోర్టు తీర్పుతో భంగపాటుకు గురైనప్పటికీ శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ ...

news

సైన్యాన్ని రాజకీయాలకు దూరంగా పెట్టడంలో భారత్ ఆదర్శం: పాక్ ఆర్మీ ఛీఫ్

మొత్తం మీద పాక్ సైన్యానికి ఒక విషయం చాలా లేటుగా బోధపడినట్లుంది. సైన్యాన్ని రాజకీయాలతో ...

Widgets Magazine