శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 జులై 2015 (18:15 IST)

యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష: ఎన్ని గంటలకు..? ఎలా ఉరితీస్తారు..?

ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారైంది. నాగ్ పూర్ జైలులో యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలుకానుంది. ఈ నేపథ్యంలో ఉరిశిక్షపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఆయన్ని ఎలా ఉరి తీస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. యాకూబ్ మెమన్ ఉరితీయడానికి సరిపడా ఫిట్‌గా ఉన్నాడని జైలు వైద్యులు అధికారులకు నివేదిక ఇచ్చారు. ఖైదీకి అర్థమయ్యే భాషలో అతనిని ఉరితీస్తున్నట్టు చెబుతారు. యాకూబ్ మెమన్ ఉరికి 22 లక్షల రూపాయలు కేటాయించారు. 
 
ఇక ఉరిశిక్ష ఎలా తీస్తారంటే...? ఉరిశిక్ష అమలు చేసేందుకు ఒక అంగుళం (రెండున్నర సెంటిమీటర్లు) వ్యాసం, 19 అడుగుల పొడవు ఉండే రెండు తాళ్లను సిద్ధం చేస్తారు. ఖైదీ బరువుకు ఒకటిన్నర రెట్ల బరువుండే బస్తాలతో ఉరికి వారం రోజుల ముందే ఆ రెండు తాళ్లను పరీక్షించి లాక్ చేస్తారు. గురువారం ఉరి అమలు చేస్తారనగా, జైలు సూపరిండెంట్ సమక్షంలో బుధవారం సాయంత్రం మరోసారి పరీక్షిస్తారు. 
 
ఉరిశిక్ష అమలు చేసే సమయంలో జైలు సూపరిండెంట్, జైలు వైద్యాధికారి, జిల్లా మెజిస్ట్రేట్, ఇద్దరు ప్రభుత్వ సాక్షులు ఉంటారు. ఉరితీసే సమయాలు నెలలను బట్టి మారతాయి. మే నుంచి ఆగస్టు వరకు ఉదయం 6 గంటలకు ఉరితీస్తారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే ఉదయం 8 గంటలకు ఉరితీస్తారు. మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మాత్రం ఉదయం 7 గంటలకు ఉరితీస్తారు.