శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (15:00 IST)

ఆశారాంకు ఏడోసారి బెయిల్‌ తిరస్కరణ.. లక్ష జరిమానా.. సుప్రీం అక్షింతలు

లైంగిక వేధింపుల కేసులో ఆశారాం బాపుకు సుప్రీం కోర్టు ఏడోసారి బెయిల్‌ను నిరాకరించింది. 16ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆశారాం 2013 ఆగస్టు నుంచి జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్య కా

లైంగిక వేధింపుల కేసులో ఆశారాం బాపుకు సుప్రీం కోర్టు ఏడోసారి బెయిల్‌ను నిరాకరించింది. 16ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆశారాం 2013 ఆగస్టు నుంచి జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేయాలని ఆశారాం కోర్టును విన్నవించుకున్నారు. అయితే దీనిపై సుప్రీం కోర్టు ఫైర్ అయ్యింది. బెయిల్‌ కోసం చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. 
 
అంతేకాకుండా తన దరఖాస్తుతో తప్పుడు వైద్యపత్రాలను సమర్పించినందుకు ఆయనపై కొత్త ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాంటి పనికిమాలిన పిటిషన్‌ దాఖలు చేసినందుకు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆయన అత్యవసర బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రాధాన్యం లేదని కొట్టేసింది. అలాగే మధ్యంతర బెయిల్‌పై గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చడానికి తిరస్కరించింది.
 
దీంతో మధ్యంతర బెయిల్‌కు కూడా కోర్టు నిరాకరించింది. కేసు విచారణను అనవసరంగా పొడిగిస్తున్నారనే అంశాన్ని, సాక్షులపై దాడులు.. వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని వదిలేయలేమనే విషయాన్ని సుప్రీం కోర్టు పేర్కొంది.