శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (15:24 IST)

టీచర్‌పై గ్యాంగ్ రేప్: యూపీలో ఆగని దాడులు

ఉత్తరప్రదేశ్లో నిత్యం మహిళలపై దాడులు ఏమాత్రం తగ్గట్లేదు. ఓ టీచర్పై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారం చేసి విలువైన వస్తువులు దోచుకెళ్లిన ఘటన యూపీలోని భోన్గాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా మధు గ్రామంలో చోటుచేసుకుంది. 
 
టీచర్ స్కూలు వెళ్తున్న సమయంలో దుండగులు ఆమె నుంచి బంగారు చైన్, ఐదువేల రూపాయల నగదును దోచుకోవడమే గాకుండా పొదలచాటుకు లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
టీచర్ కేకలు విన్న స్థానికులు ఓ నిందితుడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.