శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 1 జులై 2015 (18:32 IST)

అది నోరా...! స్టోరా...!! ఏమిటా కుక్కుకోవడం..? ఎక్కడ..?

ఏమిటీ..? చాటంత నోరేసుకుని అరుస్తున్నావ్.. అంటుంటారు. నిజంగా నోరు చాటంత ఉండదు.. అదేమైనా కడుపా... రామాద్రి చెరువు అలా తింటున్నావ్ అంటుంటారు.. ఇక్కడా నిజంగా కడుపు చెరువంత ఉండదు.  ఇవన్ని మన పెద్దల నుంచి వస్తున్న సాధారణ సామెతలు. కానీ అతణ్ణి చూసిన వారెవరైనా అది నోరా...! స్టోరా... ? అని ఆశ్చర్యపోతారు. ఏం ఎందుకు? అది నిజంగా చిన్నసైటు స్టోరే. ఆరు గోల్ప్ బంతులను అమాంతం తన నోట్లో కుక్కేసుకోగలడు. 208 చాక్ పీసులను నోట్లో సర్దేయగలడు. ఇవి శాంపిల్ మాత్రమే.. ఇంకా ఏమేమి చేయగలడో తెలుసుకోవాలనుందా... అయితే ఢిల్లీకి వెళ్ళాల్సిందే. 
 
 ఢిల్లీకి చెందిన ఆ సైన్స్‌‌టీచర్ పేరు దినేష్ ఉపాధ్యాయ..అఫ్‌కోర్స్.. మాక్సిమౌత్ అని పిల్లలు, తోటి ఉపాధ్యాయులు ముద్దు పేరు కూడా పెట్టుకున్నారనుకోండి... నోట్లో వస్తువులను సర్ది ఇప్పటికి  48వ్యక్తిగత రికార్డులు సాధించాడు. నోట్లో 92 పెన్సిళ్లు..అయిదు గోల్ప్ బంతులు., 79 ద్రాక్ష పళ్లు,  12 వెలుగుతున్న క్యాండిల్స్ పట్టించి రికార్డ్ సాధించాడు.  
 
అలాగే 1001 కూల్ డ్రింక్ తాగే స్ట్రాలు పట్టించి మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. నోట్లో  208 చాప్‌‌‌స్టిక్‌లు  పట్టించి మరో రికార్డ్ కొట్టేశాడు. చిన్ని నోట ఆరు టేబిల్ టెన్నిస్ బంతులను నిమిషం పాటు ఉంచి రికార్డు సాధించాడు. ఈ సక్సెస్ వెనుక అయిదేళ్ల కృషి ఉందంటున్న దినేష్  బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్, యోగా సాధన వల్లే ఇది సాధ్యమైందంటున్న ఉపాధ్యాయ మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలనుకుంటున్నట్టు తెలిపాడు.