శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 అక్టోబరు 2015 (09:21 IST)

టీబీ రహిత భారత్‌గా మార్చాలి : కేంద్ర మంత్రి హర్షవర్ధన్

భారత్‌ను టీబీ రహిత దేశంగా మార్చాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కోరారు. ఈ మేరకు ఆయన శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌, తార్నాకలోని సీఎస్‌ఐఆర్‌ ఐఐసీటీ(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ)లో జరగిన ఓ కార్యక్రమలో పాల్గొని మాట్లాడుతూ.. భారత్‌ను పోలియో రహిత దేశంగా మార్చామని, అదేవిధంగా టీబీ(క్షయ) రహిత దేశంగా కూడా మార్చాలని కోరారు. 
 
1995లో తాను, మరికొందరు వైద్యులు కలిసి పోలియో నిర్మూలనపై మేధోమథనం సాగించామని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం దేశంలో ఒక్క పోలియో కేసు కూడా లేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించిందని గుర్తు చేశారు.