శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (14:57 IST)

మహారాష్ట్రలో బీజేపీ-శివసేనల మధ్య పొత్తు: కానీ సీట్లు మాత్రం?

మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, శివసేన పట్టువిడుపు ధోరణితో వ్యవహరించి, సీట్ల సర్దుబాటు దిశగా అడుగులు వేస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ఎంతో ఆసక్తిరేకించిన ఈ పార్టీల పొత్తు వ్యవహారం సాయంత్రానికి గాడినపడింది. 
 
రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగే పరిస్థితి అయితే ప్రస్తుతానికి వచ్చిందిగానీ, సీట్ల సంఖ్యపై మాత్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. 2009లో మాదిరిగా బీజేపీకి 119 సీట్లు ఇస్తామని శివసేన ప్రతిపాదించగా, అందుకు బీజేపీ తిరస్కరించినట్లు తొలుత వార్తలొస్తున్నాయి.
 
చెరో 135 స్థానాల్లో పోటీ చేసి, మిగిలిన స్థానాలను మిత్ర పక్షాలకు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇంకా, 135 సీట్లు కావాలన్న డిమాండ్‌ నుంచి బీజేపీ కొంత వెనక్కి తగ్గినట్లు సమాచారం.