Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పకోడీలు అమ్ముకుంటే తప్పేంటి? రాజ్యసభలో అమిత్ షా

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (10:57 IST)

Widgets Magazine

నిరుద్యోగంతో మిన్నకుండేకంటే.. పకోడీలు అమ్ముకోవడం మంచిదని.. అందులో సిగ్గుచేటు ఏముందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ప్రధాని మోదీ పకోడీ వ్యాఖ్యలపై డిగ్రీ విద్యార్థులు రోడ్లపై పకోడీలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ప్రధానిపై సెటైర్లు విసిరారు. 
 
ఉద్యోగ భద్రతను కల్పించలేని ప్రభుత్వం పకోడీలు అమ్ముకోవాలని చెప్పడం విడ్డూరంగా వుందని నెటిజన్లు విమర్శించారు. ఈ నేపథ్యంలో మోదీ పకోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అడిగిన ప్రశ్నలకు అమిత్ షా రాజ్యసభలో స్పందించారు. ఉద్యోగం లేకుండా నిరుద్యోగంతో చేతులు ముడుచుకుని కూర్చోవడం కంటే.. ఏదో ఓ పనిచేసుకోవడం లేదంటే పకోడీలు అమ్ముకోవడం మంచిదని.. ఇది సిగ్గుపడాల్సి విషయం కాదని అమిత్ షా బదులిచ్చారు.
 
55 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నిరుద్యోగాన్ని అరికట్టలేకపోయిందని అమిత్ షా విమర్శించారు. యూపీఏ హయాంలో దేశానికి విధానపరమైన పక్షవాతం వచ్చిందన్నారు. మోదీ సారథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జన్‌ధన్ యోజన పెద్ద విజయాల్లో ఒకటని అమిత్ షా ఎత్తి చూపారు. ఇక జీఎస్టీతో దేశానికి ఎంతో మేలు చేకూరుందని.. జీఎస్టీ లీగల్ ట్యాక్స్‌ను గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఎలా అంటారని కాంగ్రెస్‌ను నిలదీశారు. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ప్రపంచం భారత్‌ను కొత్త కోణంలో చూడటం మొదలెట్టిందని చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎన్డీయే కూటమికి బీటలు... టీడీపీ తిరుగుబాటుతో బీజేపీ నేతల్లో గుబులు

భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి బీటలు వారుతున్నట్టు కనిపిస్తోంది. వార్షిక ...

news

ప్రధాని మోడీకి అంత అహంకారం పనికిరాదు : అకాలీదళ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఎన్డీయే మిత్రపక్షమైన అకాలీదళ్ నేత నరేశ్ గుజ్రాల్ తీవ్ర ఆగ్రహం ...

news

చంద్రబాబు ఆగ్రహిస్తే భూమండలమే కంపించిపోతుంది : ఎంపీ శివప్రసాద్

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహిస్తే భూమండలమే కంపించిపోతుందని ...

news

పీఎంవోను తాకిన టీడీపీ నిరసన సెగలు.. నేడు మోడీతో ఎంపీల భేటీ

విత్తమంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన తీరని అన్యాయంపై ...

Widgets Magazine