శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 16 అక్టోబరు 2014 (15:22 IST)

వివాహానికి ముందే సెక్స్ సామర్థ్య పరీక్షలా? కుదరదు...

వివాహానికి ముందే సెక్స్ సామర్థ్య పరీక్షలా? కుదరదు...

యువతీయువకులకు పెళ్లికి ముందే లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించలేమని, అది వ్యక్తి గత స్వేచ్ఛను హరించడమే అవుతుందని మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌కు కేంద్ర ప్రభుత్వం ఒక లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. 
 
నానాటికీ పెరిగిపోతున్న విడాకుల కేసులకు చెక్ పెట్టే రీతిలో పెళ్లికి ముందే యువతీ యువకులకు సెక్స్ సామర్థ్య  పరీక్షలు చేయించే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని, ఆ మేరకు తమ అభిప్రాయాన్ని మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ కోరింది. 
 
దీనిపై కేంద్రం ప్రభుత్వం తన వాదనను లిఖిత పూర్వకంగా సమర్పించింది. అందులో ఒక వ్యక్తి సమ్మతం మేరకే వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈ విషయంలో ఏ ఒక్కరినీ నిర్బంధించేలేం. అలాగే యువతులను నిర్బంధ కన్యత్వ పరీక్షలు, యువకులను పురుష లైంగిక సామర్థ్య టెస్టులకు సమ్మతించాలని కోరలేం. 
 
ఇటువంటి పరీక్షలు నిర్వహించడం ఒక వ్యక్తి వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకున్నట్టే అవుతుంది. అంతేకాకుండా ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. లైంగిక సంబంధం అనేది వారి వారి వ్యక్తిగత ఇష్టం. అందువల్ల పెళ్ళికి ముందే యువతీ యువకులకు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించడం అసాధ్యమని కేంద్ర తేల్చి చెప్పింది.